Homeహైదరాబాద్latest Newsఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలో సత్తా చాటిన గొల్లపల్లి విద్యార్థి.. ఆల్...

ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలో సత్తా చాటిన గొల్లపల్లి విద్యార్థి.. ఆల్ ఇండియా 15వ ర్యాంక్..!

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల్ జిల్లా, గొల్లపల్లి గ్రామానికి చెందిన చాడ సాయి కృష్ణ AIAPGET (ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష)లో ఆల్ ఇండియా 15వ ర్యాంకు, తెలంగాణ రాష్ట్రంలో రెండవ ర్యాంకు సాధించారు. సంగారెడ్డి లోని MNR మెడికల్ కాలేజ్ లో హోమియోపథీ విద్యను అభ్యసించారు. ఈయన తల్లిదండ్రుల పేర్లు చాడ శ్రీనివాస్ మరియు వనజ. చాడ సాయి కృష్ణ ఈ విజయాన్ని సాధించడం ద్వారా గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మరియు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. AIAPGET పరీక్షలో ఇంతటి ప్రతిష్టాత్మక ర్యాంకు సాధించడం తన పట్టుదలకు నిదర్శనం. ఈ యువకుడి సాధన ప్రతి విద్యార్థికి ప్రేరణగా నిలుస్తుంది. ఇతని కృషి, అంకితభావం మరియు పట్టుదలతో ఈ విజయాన్ని సాధించారని కుటుంబ సభ్యులు తెలిపారు. చాడ సాయి కృష్ణ టాప్ NIH కాలేజ్ కోసం ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img