స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో పెద్ద మొత్తంలో లాభం అంటూ ఆన్లైన్ మోసగాళ్లు విసిరిన వలలో మహారాష్ట్రకి చెందిన డాక్టర్ పాటిల్ చిక్కుకున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీయే ప్రచారం చేసినట్లు ఉండటంతో పాటిల్ భారీ మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి మోసపోయారు. దాంతో ఆయన పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. అప్పుడే అంబానీది డీఫ్ ఫేక్ వీడియో అని తేలింది.