ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరిన వారం రోజులకే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరి పార్టీని వీడడం తీవ్ర చర్చకు దారితీసింది. గుంటూరు ఎంపీ సీటు ఇవ్వనందువల్లే రాయుడు వైసీపీని వదిలేశాడని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తెరదించేందుకు రాయుడు ట్వీట్ చేశాడు.
“తను ఇంటర్నేషనల్ లీగ్ టీ20 పోటీల్లో పాల్గొంటున్నానని, జనవరి 20 నుంచి దుబాయ్ లో జరిగే ఈ పోటీల్లో ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు.. అయితే, ఈ టోర్నీలో పాల్గొనే ప్రొఫెషనల్ ఆటగాళ్లకు ఎలాంటి రాజకీయ సంబంధాలు ఉండకూడదన్న నిబంధన ఉంది” అంటూ అంబటి రాయుడు X లో పోస్ట్ చేశాడు.