బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ నెల 20 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి నెలలో అరెస్టు అయిన ఆమె ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అయితే 8 వేల పేజీల సప్లిమెంటరీ ఛార్జిషీటు దాఖలు చేసినట్లు ఈడీ తెలిపింది. ఈ నెల 20న ఈ సప్లిమెంటరీ చార్జిషీట్‌ను కోర్టు విచారించనుంది.