వైఎస్ జగన్కు మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీలోని నాయకులంతా మూకుమ్మడిగా టీడీపీలో చేరుతున్నారు. మొన్నటివరకు నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. బైరెడ్డి రాజశేఖర రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో వైసీపీ నేతలంతా టీడీపీ కండువాలు కప్పుకుంటున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలో వైసీపీ ఖాళీ కాగా.. ఇప్పుడు మండల స్థాయి నాయకులు కూడా వైసీపీని వీడుతున్నారు.