Homeహైదరాబాద్latest Newsసంక్రాంతికి తెలంగాణ RTC మరో గుడ్ న్యూస్.. వారికీ ఫ్రీ..

సంక్రాంతికి తెలంగాణ RTC మరో గుడ్ న్యూస్.. వారికీ ఫ్రీ..

సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ 4,484 స్పెషల్ బస్ సర్వీసుల్ని అందుబాటులోకి తేనుంది. సహజంగా స్పెషల్ బస్సులంటే రేట్లు పెంచేస్తారు. అప్పటి వరకు ఇచ్చే రాయితీలను ఆ బస్సుల్లో రద్దు చేస్తారు. తెలంగాణ ఆర్టీసీ ప్రకటన తర్వాత కూడా కొందరిలో ఇవే అనుమానాలున్నాయి. అయితే వీటన్నిటికీ ప్రకటన సమయంలోనే క్లారిటీ ఇచ్చారు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.

సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారికోసం TSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,484 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. వీటిలో 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఈనెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని TSRTC తెలిపింది. అయితే ఈ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేయట్లేదు. సాధారణ చార్జీలే అమలు చేస్తున్నారు. అంతే కాదు. మహాలక్ష్మి స్కీమ్ కూడా ఈ బస్సుల్లో అమలులో ఉంటుంది. మహిళలు జీరో టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

Recent

- Advertisment -spot_img