క్యాన్సర్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ప్రాణాంతక సమస్య ప్రాణాల మీదకు తెస్తోంది. కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మనిషి శరీరం మొత్తం కణజాలాలతో నిండి ఉంటుంది. అయితే కణజాలం అనవసరంగా విపరీతంగా పెరిగిపోవడమే క్యాన్సర్. శరీరంలో సాధారణంగా కణాల విభజన నిత్యం జరుగుతూనే ఉంటుంది. కణాలు పుడుతూ, చనిపోతూ ఉంటాయి. డీఎన్‌ఏ మార్పుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కారణంగానే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వస్తుంటాయి. ఈ క్రమంలోనే క్యాన్సర్ కూడా వారసత్వంగా వచ్చే అవకాశముందని తెలుస్తుంది.