Homeజాతీయంటూరిజం స్పాట్‌ల‌ను మూసివేసిన ఏఎస్‌ఐ

టూరిజం స్పాట్‌ల‌ను మూసివేసిన ఏఎస్‌ఐ

దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మే 15వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయించింది.

సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ సైతం ఉత్తర్వులను ట్వీట్‌ చేశారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా సాంస్కృతిక మంత్రిత్వశాఖ, భారత పురావస్తు సర్వే అన్ని స్మారక చిహ్నాలను మూసివేయాలని నిర్ణయించిందని తెలిపారు. గతేడాది మార్చిలో కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో మూతపడ్డాయి.

తర్వాత కేసులు తగ్గుముఖం పట్టడంతో గతేడాది డిసెంబర్‌లో పర్యాటకులకు అనుమతి ఇచ్చారు.

నిన్న ఒకే రోజు దేశంలో రెండు లక్షలకుపైగా కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి.

ఈ క్రమంలో వైరస్‌ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో అన్నింటిని మూసివేయాలని నిర్ణయించింది.

తాజా నిర్ణయంతో ఆగ్రాలోని తాజ్‌మహల్‌, మీజోరాంలోని ఐజాల్‌, ఔరంగాబాద్‌ కేవ్స్‌ సహా దేశవ్యాప్తంగా ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఆధీనంలో ఉన్న పర్యాటక ప్రాంతాలు, మ్యూజియాలు మూతపడనున్నాయి.

Recent

- Advertisment -spot_img