ఇదే నిజం, మహబూబాబాద్ ప్రధాన ప్రతినిధి : రాముల వారి ఆశీస్సులతో దైవ సన్నిధిలో నామినేషన్ పత్రాల స్వీకరణ. కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు వెంటరాగాకలెక్టరేట్కుచేరుకున్నారు. అనంతరం 12: 20 నిమిషాలకు తన నామినేషన్ రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ అందజేశారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ శుక్రవారం కుటుంబ సమేతంగా రాముల వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపి అనంతరం దాఖలు చేయబోయే నామినేషన్ పత్రాలను రాములవారి దైవసన్నిధిలో విజయాశీస్సులతో స్వీకరించారు. అనంతరం మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్, పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు తదితరులు వెంటరాగా కలెక్టరేట్కు వెళ్లి రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ తన నామినేషన్ను వేయడం జరిగింది.