తెలంగాణలో ఇంకా పంచాయతీ ఎన్నికల నగారా మోగకముందే ఓ గ్రామ సర్పంచ్ ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. వరంగల్ జిల్లా, చెరువు కొమ్ము తండా సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. గ్రామంలో 3 ఆలయాలు కట్టించి, బొడ్రాయి పండుగ వేళ ఇంటికి రూ.1000 ఇస్తానని దరావత్ బాలాజీ అనే వ్యక్తి ప్రతిపాదించాడు. అందుకు సర్పంచ్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయొద్దని షరతు విధించాడు. దీనికి గ్రామస్తులు అంగీకరించడంతో పాటు అతడితో అగ్రిమెంట్ రాయించుకున్నారు. సర్పంచ్ గా ఏకగ్రీవం చేస్తూ విజయోత్సవ ర్యాలీ తీశారు.