Homeబిజినెస్‌BitCoin Crash : క్రిప్టో కరెన్సీలు కనిష్ఠ స్థాయికి పతనం

BitCoin Crash : క్రిప్టో కరెన్సీలు కనిష్ఠ స్థాయికి పతనం

BitCoin Crash : బిట్‌కాయిన్‌తోపాటు ఇతర డిజిటల్ క్రిప్టో కరెన్సీలు శనివారం ట్రేడింగ్‌లో కనిష్ఠ స్థాయికి పతనం అయ్యాయి.

ఫలితంగా క్రిప్టో కరెన్సీల మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల డాలర్లకు పైగా నష్టపోయింది.

క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ 35వేల డాలర్ల వద్ద తచ్చాడుతున్నది.

గత నవంబర్ నెలలో 69 వేల డాలర్ల చేరువలో ఆల్‌టైం రికార్డు నమోదు చేసిన తర్వాత బిట్ కాయిన్ 40 శాతానికి పైగా పతనమైంది.

మార్చిలో కీలక వడ్డీరేట్లు పెంచుతామని అమెరికా ఫెడ్ రిజర్వు ప్రకటించడంతో ఇన్వెస్టర్లు సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ వైపు మళ్లుతున్నారు.

ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలు పతనం కావడం గమనార్హం.

Jio 6G : త్వ‌ర‌లో భార‌త్‌లో జియో 6జీ సేవ‌లు

Career : ఉద్యోగాలకు రాజీనామాలు.. కొత్త కెరీర్ వైపు చూపులు

ఇతర క్రిప్టో టోకెన్లు ఎథీరియం, బినాన్స్ కాయిన్‌, కార్డనో కూడా నష్టపోయాయి.

ఇంకా సొలానా, డోజ్ కాయిన్‌, శిభా ఇను వంటి టోకెన్లు భారీగా పతనం అయ్యాయి.

36 వేల డాలర్ల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్‌కు 30 వేల డాలర్ల వద్ద కూడా సపోర్ట్ లభించకపోవచ్చునని ఒయాండా అనలిస్ట్ ఎడ్వర్డ్ మోయా చెప్పారు.

గత నవంబర్ నుంచి బిట్ కాయిన్ విలువ 600 బిలియన్ డాలర్లకు పైగా పతనం అయింది.

ఐఎంఎం రీసెర్చ్ ప్రకారం క్రిప్టో కరెన్సీలతో వివిధ దేశాల ఆర్థిక సుస్థిరతకు ముప్పుని తెలుస్తున్నది.

క్రిప్టో కరెన్సీల ముప్పును నివారించడానికి సమగ్రంగా సమన్వయంతో కూడిన గ్లోబల్ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ అవసరం అని చెబుతున్నారు.

2017లో 620 బిలియన్ల డాలర్లుగా ఉన్న క్రిప్టో- మార్కెట్ క్యాపిటలైజేషన్ గత నవంబర్‌లో 3 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నది.

Candy Crush Saga : క్యాండీ క్రష్‌ను కొన్న మైక్రోసాఫ్ట్‌

Gas Car : గ్యాస్ తో నడిచే కారును ఆవిష్కరించిన మారుతి

Insurance : ఈ వ‌య‌సులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..

Recent

- Advertisment -spot_img