HomeతెలంగాణBJP: బండి మార్పుతో కారు ఓట్లకు గండి?

BJP: బండి మార్పుతో కారు ఓట్లకు గండి?

  • లాభం కంటే నష్టమే ఎక్కువ
  • కాంగ్రెస్ వైపు యువత చూపు ?
  • ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకే వైపు వెళ్లే చాన్స్?
  • మైనార్టీలు దూరం

BJP:ఇదే నిజం, స్టేట్ బ్యూరో: బీజేపీ స్టేట్ చీఫ్ గా బండిని తప్పించి కిషన్ రెడ్డిని నియమించడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఖుషీగా ఫీలయ్యాయి. రాష్ట్రంలో బీజేపీ వీక్ అవుతుందని భావించారు. కాంగ్రెస్ ను దెబ్బ తీసేందుకే బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నాయన్న వాదన కూడా తెరమీదకు వచ్చింది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు మేలు చేసేందుకు బీజేపీ అధినాయకత్వం.. రాష్ట్రంలో బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తప్పించి కిషన్ రెడ్డిని నియమించిందని జోరుగా విశ్లేషణలు సాగాయి. అయితే బండిని తప్పించడం బీఆర్ఎస్ కు లాభం కన్నా నష్టమే వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో తాము అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రాకూడదన్న ఉద్దేశ్యంతో బీజేపీ.. బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసిందన్న వాదన ఉంది.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ స్టేట్ చీఫ్ ను మార్చడం బీజేపీ ఘోరంగా నష్టపోతున్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కాంగ్రెస్ ఖాతాలో పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ యువతను ఆకర్షించారు. కానీ కిషన్ రెడ్డి పెద్దగా ఆకట్టుకోలేరు. దీంతో యూత్ మొత్తం బీజేపీ హైకమాండ్ తీరుతో అసహనంగా ఉన్నారు. వారు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మైనార్టీలు దూరం
భారతీయ జనతాపార్టీకి మొదటి నుంచి మైనార్టీలు పెద్దగా సపోర్ట్ చేయడం లేదు. అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు నిలిచిన మైనార్టీలు ఆ సారి ఆ పార్టీకి దూరమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ అవగాహనకు వచ్చాయని వార్తలు వినిపిస్తుండటంతో వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఎలాగైనా గద్దె దించాలని కొందరు మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, హక్కుల నేతలు, వివిధ సంఘాల నేతలు కంకణం కట్టుకున్నారు. అయితే వారంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.

కిషన్ రెడ్డి మెతకవైఖరితో నష్టం
మరోవైపు బండి సంజయ్ రాష్ట్రంలో దూకుడుగా ముందుకు సాగేవారు. తటస్థలుగా ఉన్న యువతను తనవైపుకు తిప్పుకున్నారు. దీంతో బీజేపీకి క్రమంగా ఓటు బ్యాంక్ పెరిగింది. అయితే ప్రస్తుతం బీజేపీ స్టేట్ చీఫ్ గా కిషన్ రెడ్డి ఉండటంతో యూత్ ను పెద్దగా ఆకర్షించలేకపోతున్నారు. దీంతో ఆ ఓటు బ్యాంక్ కూడా క్రమంగా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లే అవకాశం ఉంది. అంతేకాక కిషన్ రెడ్డి మెతక వైఖరితో బీజేపీకి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, యువతను తన వైపు తిప్పుకోవడంలో కిషన్ రెడ్డి సక్సెస్ కాలేరు. దీంతో ఆయన వైఖరితో బీజేపీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని వాదన తెరమీదకు వస్తున్నది

Recent

- Advertisment -spot_img