Home Blog

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

0

పశుసంవర్థక శాఖ కేసులకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. పశుసంవర్థక శాఖకు సంబంధించిన కేసులు ఏసీబీ(ACB)కి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గొర్రెల పంపిణీ వ్యవహారంలో అక్రమాలకు సంబంధించి పశసంవర్థక శాఖపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపైనా కేసు నమోదైంది. ఈ రెండు కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ నిధుల బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి గచ్చిబౌలిలో ఇప్పటికే అధికారులపై, పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయంపై కేసు నమోదైంది.

పండగ వేళ నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డుప్రమాదం..

0

నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. జిల్లాలో వంగూరు మండలం, తిప్పారెడ్డిపెల్లి గేటు వద్ద ఈరోజు ఉదయం డ్రైవర్ తప్పిదం వల్ల కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలవ్వగా.. 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను హైదరాబాద్, ఉప్పల్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. మూడు రోజులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా..

0

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రయాణికులకు UN LIMITED ప్రయాణ సౌకర్యాన్ని తీసుకువచ్చింది. సూపర్ సేవర్ కార్డును రూ.59తో రీచార్జ్ చేయించుకుంటే సరిపోతుంది. మెట్రోలో ఒక రోజంతా ఎక్కడ్నించి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఈ సదుపాయం అమలులో ఉంటుంది. 

మెట్రో రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో ఈ సూపర్ సేవర్ కార్డులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ మెట్రో సూపర్ సేవర్ కార్డులను ఎప్పటినుంచో ఇస్తోంది. ఈ కార్డును ఒకసారి కొనుగోలు చేయాలంటే రూ.109 చెల్లించాలి. ఇప్పుడు ఈ కార్డును రూ.59తో రీచార్జ్ చేసుకుంటే UN LIMITED ప్రయాణ సౌకర్యాన్ని పొందుతారు.

‘బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు’

0

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 13 నుండి 14 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు స్వయంభు రామలింగేశ్వర స్వామి వారిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని, బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉంటే.. కేసీఆర్‌ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు మాత్రమే అన్ని రకాలుగా లాభపడ్డారన్నారు.

లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పునరుద్ధరిస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతిమయమన్నారు. 6 గ్యారంటీల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందన్నారు. బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. మేమంతా రామ భక్తులమే రామ మందిరం అంశాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఈవెంట్ గా మారుస్తున్నారన్నారు. శంకరాచార్యులు , మఠాధిపతులు రామమందిర ప్రతిష్ఠకు దూరంగా ఎందుకు ఉంటున్నారో బండి సమాధానం చెప్పాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.

అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. ఎంటో తెల్సా..?

0

దాదాపు 14 నెలల తర్వాత విరాట్ కోహ్లీ టీ20 ఆడేందుకు సిద్ధమయ్యాడు. అఫ్గానిస్థాన్ పై చెలరేగి ఘనంగా పునరాగమనం చేయాలని చూస్తున్నాడు. ఈ రోజు రాత్రి 7 గంటలకు ఇండోర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోహ్లీ 35 రన్స్ చేస్తే అరుదైన ఘనత సాధించనున్నాడు. టీ20ల్లో 12,000 మార్కును అందుకోనున్నాడు. దీంతో ఈ మార్కును అందకున్న తొలి భారత్ ఆటగాడికి కోహ్లీ రికార్డ్ నెలకొల్పుతాడు.

పొట్టి క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ క్రిస్ గేల్(14562) పేరిట ఉండగా.. తర్వాత షోయబ్ మాలిక్(12,993), విండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్(12,430) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

TSRTC.. అమ్మాయిలు పొట్టుపొట్టు కొట్టుకున్నారు..

0

తెలంగాణ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం మరోసారి మహిళల పైటింగ్ కు దారితీసింది. మహాలక్ష్మీ స్కీమ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి సీట్ల కోసం ఆడవాళ్ల ఫైటింగ్ లు పెరిగిపోతున్నాయి. తాజాగా సీట్ల కోసం ఇద్దరు అమ్మాయిలు జుట్టు పట్టుకుని చితక్కొట్టుకున్న మరో వీడియో వైరల్ అయింది. సంగారెడ్డి జిల్లాలో ఈ ఫైటింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

నలుగురు అమ్మాయిలు జుట్లు పట్టుకుని పిడిగుద్దులతో దారుణంగా కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు ఆపే ప్రయత్నం చేసినా ఆగకుండా సిగపట్లకు దిగడంతో తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాగా పండగలు, సెలవు రోజుల్లో రద్దీ కారణంగా సీట్లు దొరకక ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని అధికారులు స్పందించి ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఏపీలో ‘తల్లికి వందనం’ పథకం.. ఆ నెలలో వారికీ రూ.15,000 జమ

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే జనవరిలో ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్కూళ్లు,కాలేజీలకు వెళ్లే విద్యార్థులందరికీ ఈ పథకం వర్తించనుంది. ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని టిడిపి మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇందుకు రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. అలాగే రూ.20 వేల లబ్ధి చేకూర్చే ‘అన్నదాత సుఖీభవ’ను మార్చి లేదా ఏప్రిల్ నెలలో అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

సీనియర్ నటి రమాప్రభ ఇంట తీవ్ర విషాదం..!

0

సీనియర్ నటి రమాప్రభ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె సోదరి తనయుడు సురేష్ ఆకస్మికంగా కన్నుమూశారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. గత 9 నెలలుగా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో సురేష్ బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, రమాప్రభ సమర్పణలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘అప్పుల అప్పారావు’ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఆయన రాజకీయంగా కూడా బాగా ఎదిగారు.

తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

0

తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం నుంచి 3 రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ స్కీమ్ ద్వారా వారి రూ.25 లక్షలు.. ఈ పథకం గురించి మీకు తెలుసా..?

0

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రయోజనం కలిగేలా ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాం (PMEGP) పథకం ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తోంది. ఉత్పత్తి పరిశ్రమలకు రూ.25 లక్షల వరకు రుణం అందిస్తారు. ఇంకా సర్వీస్ రంగ పరిశ్రమలకు రూ.10 లక్షల వరకు లోన్ ఇస్తారు. అయితే ఈ రుణాలపై రాయితీ కూడా ఉంటుంది. www.kviconline.gov.in వెబ్‌సైట్‌ ద్వారా మీరు పూర్తి సమాచారం పొందొచ్చు.

భారత్‌ ఖాతాలో మరో చెత్త రికార్డు

0

భారత్ ఖాతాలో మరో చెత్త రికార్డు నమోదైంది. తొలి టెస్టులో న్యూజిలాండ్ 240+ ఆధిక్యం సాధించింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్‌ 46 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. 12 ఏళ్ల తర్వాత సొంత మైదానంలో ప్రత్యర్థికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడం ఇదే తొలిసారి. చివరిసారిగా 2012లో 207 పరుగుల లీడ్‌ను ఇంగ్లాండ్ సాధించింది.

మధ్యాహ్న భోజనంలో మార్పులు.. దీపావళి నుండి అమలు..!

0

మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతూ మెనూలో దీపావళి నుంచి మార్పులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెగ్యులర్ ఫుడ్‌తో పాటు వారంలో 5 రోజులు ఇస్తున్న గుడ్డును.. 3 రోజులుపాటు వేపుడు, కూర రూపంలో ఇవ్వనున్నారు. రాగి జావతోపాటు వారంలో కొన్ని రోజులు కేక్, డ్రైఫ్రూట్స్ లడ్డూను అందిస్తారు. ఓ రోజు అరటి పండు కూడా మెనూలో చేరుస్తారు.

గోల్డ్ లవర్స్‌కి షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

0

‘దీపావళి’ పండగ ముందు గోల్డ్ లవర్స్‌కి వరుస షాకులు తగులుతున్నాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గురువారంతో పోలిస్తే.. శుక్రవారం మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 800 పెరగడంతో రూ. 72,400 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 870 పెరిగి.. రూ. 78,980 కి చేరుకుంది. అదే విధంగా కిలో వెండి ధర రూ. 2,000 పెరిగి.. రూ. 1,05,000 గా కొనసాగుతుంది.

రైతు భరోసాపై కీలక నిర్ణయం.. రైతు ఖాతాలోకి ఎకరానికి రూ.15వేలు?

0

తెలంగాణలో ఈ నెల 23న జరుగనున్న కేబినెట్ భేటీలో రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వానాకాలం పంటకు సంబంధించి రైతు భరోసా కింద ఒక్కో ఎకరానికి రూ.7,500 జమ చేయాల్సి ఉన్నా.. రుణమాఫీ కారణంగా చేయలేదు. రాబోయే యాసంగితో కలిసి ఒక్కో రైతుకు రూ.15,000 అందించనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై మంత్రి వర్గ భేటీ తర్వాత క్లారిటీ రానుంది.

హైడ్రా మరో కీలక నిర్ణయం..!

0

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలపై ట్రాఫిక్ విభాగంతో కలసి పని చేయాలని హైడ్రా నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చెందిన DRF బృందాలకు ట్రాఫిక్ నియంత్రణపై శిక్షణ ఇప్పించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు లేని సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులతో కలసి హైడ్రా DRF బృందం కలిసి పని చేసేలా ఏర్పాట్లు చేయాలని ట్రాఫిక్ సమస్యపై గురువారం నిర్వహించిన మీటింగ్ లో నిర్ణయించారు.

సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని.. పోలీసులకు మెసేజ్.. రూ.5 కోట్లు డిమాండ్..!

0

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ముంబై పోలీసులకు వాట్సాప్ లో బెదిరింపు మెసేజ్ వచ్చింది. ‘లైట్ గా తీసుకోవద్దు. సల్మాన్ బతికి ఉండాలన్నా, లారెన్స్ బిష్ణోయ్ శత్రుత్వం ఆగిపోవాలన్నా సల్మాన్ రూ.5 కోట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ పరిస్థితి బాబా సిద్ధిఖీ కంటే ఘోరంగా ఉంటుంది’ అని వార్నింగ్ ఇచ్చారని పోలీసులు తెలిపారు. దీనిపై పచోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.