Home Blog Page 1217

Tollywood : బన్నీకి జోడిగా దీపికా పదుకొనే..!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబోలో కొత్త ప్రాజెక్ట్​ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ 2024 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందని ఇప్పటికే వార్తలు వినిపించాయి. అయితే, తాజాగా ఈ సినిమాలోని నటించబోయే హీరోయిన్​కు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికా పదుకొనేను హీరోయిన్​గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీపికా బాలీవుడ్​లో టాప్​​ హీరోయిన్​గా కొనసాగుతోంది. పాన్ ఇండియా మూవీ ‘కల్కి’లో రెబల్ స్టార్ ప్రభాస్​ సరసన నటిస్తున్న దీపిక.. బన్సీ–త్రివిక్రమ్​ మూవీలో యాక్ట్​ చేస్తే ఇది ఆమె రెండో తెలుగు సినిమా అవుతుంది. బన్నీ సరసన దీపిక పదుకొనే స్టెప్స్ వేస్తే అదిరిపోతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్​ సంబురపడిపోతున్నారు. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్​గా పూజా హెగ్డేని తీసుకోబోతున్నట్లు సమాచారం.

నవంబర్ 2న OTT లోకి జవాన్​..?

0

బాలీవుడ్​ బాద్​షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్​టైనర్ జవాన్. సెప్టెంబర్​లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. వరల్డ్​ వైడ్​గా1,150 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన జవాన్.. షారుఖ్​ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించింది. హిందీ లో 590 కోట్ల వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసింది. అయితే. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్​కు రెడీ అయినట్లు తెలుస్తోంది. షారుఖ్​ ఖాన్ బర్త్ డే సందర్భంగా నవంబర్ 2న ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్​గా నెట్​ఫ్లిక్స్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, తొందరలో దీనిపై ఒక క్లారిటీ రానుంది. నయనతార హీరోయిన్​గా నటించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సంజయ్ దత్, దీపికా పడుకునే కీలక పాత్రల్లో నటించారు.

Politics : Revanth met with Kodandaram Politics : కోదండరాంతో రేవంత్​ భేటీ

0

– మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
– ప్రభుత్వం ఏర్పడ్డాక సముచిత పదవి ఇస్తామని హామీ

ఇదేనిజం, హైదరాబాద్​: టీజేఎస్​ అధినేత కోదండరాంతో పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాడ్డక సముచిత పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. చాలా రోజులుగా టీజేఎస్.. కాంగ్రెస్​ కలిసి పోటీ చేయబోతున్నాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే టీజేఎస్​ కు కాంగ్రెస్​ పార్టీ టికెట్లు ఏమీ కేటాయించలేదు. కోదండరామ్​ లేదా ఆయన పార్టీ నేతలు పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని .. కాంగ్రెస్​ పార్టీ భావిస్తోంది. అందుకే కోదండరామ్​ ను మద్దతు ఇవ్వాలని రేవంత్​ కోరారు. సోమవారం ఉదయం నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్‌కు చేరుకున్న రేవంత్, కర్ణాటక మంత్రి బోసురాజు.. కోదండరాంను కలిశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా కోదండరాంను రేవంత్ కోరనున్నారు. కలిసి పనిచేద్దామని ఇప్పటికే ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌తో భేటీ అయి కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి కోదండరాం అంగీకరించినట్టు సమాచారం.

In those 13 segments, polling will be held till 4 pm ఆ 13 సెగ్మెంట్లలో సాయంత్రం 4 వరకే పోలింగ్‌

0

– నోటిఫికేషన్ రిలీజ్ చేసి కేంద్ర ఎన్నికల సంఘం

ఇదే నిజం, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్‌ ముగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకే పోలింగ్‌ జరగనుంది. మిగతా 106 స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Harish to Vishnu Vardhan Reddy’s house విష్ణు వర్ధన్​ రెడ్డి ఇంటికి హరీశ్​

0

– త్వరలో బీఆర్ఎస్​లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే

హైదారాబాద్: జూబ్లీహిల్స్​ మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్​ రెడ్డి త్వరలో బీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరబోతున్నారు. సోమవారం మంత్రి హరీశ్​రావు విష్ణువర్ధన్​ రెడ్డికి ఇంటికి వెళ్లారు. బీఆర్ఎస్​ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. త్వరలోనే విష్ణు చేరికకు సంబంధించిన తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే విష్ణు వర్ధన్​ రెడ్డి ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. బీఆర్‌ఎస్‌లో చేరికకు విష్ణువర్ధన్ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. విష్ణును కలిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో చేరాలని విష్ణును కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అవమానించిందని విష్ణు బాధపడ్డారని.. తాము విష్ణు అందరం ఐదేళ్లు శాసనసభ సభ్యులుగా ఉన్నామని తెలిపారు. అనేక ఉద్యమాల్లో విష్ణు తమతో కలిసి పోరాడారని చెప్పారు. బీఆర్ఎస్‌లో చేరేందుకు విష్ణు సుముకుత వ్యక్తం చేశారని తెలిపారు. పట్టపగలు డబ్బు కట్టలతో దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని.. సీట్లు అమ్ముకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుంది అనేది జనాలు గుర్తించాలన్నారు.

Kishan Reddy : హామీ ఇస్తే పక్కాగా అమలు చేస్తాం

0

– బీజేపీది సామాజిక న్యాయమే
– బీఆర్​ఎస్​, కాంగ్రెస్​.. ఎంఐఎంను అడ్డుపెట్టుకొని రాజకీయం
– కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : బీజపీ హామీ ఇస్తే పక్కాగా అమలు చేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బీజేపీనే అన్నారు. హామీలు ఇచ్చి ఊరుకోకుండా అమలు చేసి చూపిస్తుందన్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో మొదటి ఐదేళ్లలో మంత్రివర్గంలో మహిళలకు సీఎం కేసీఆర్‌ చోటు ఇవ్వలేదన్నారు. అంతేకాదు కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలకు బీసీలకు అన్యాయం చేశాయన్నారు. బీజేపీ సామాజిక న్యాయం చేసిన పార్టీ అని, అబ్ధుల్​ కలాంను రాష్ట్రపతి చేసిన ఘనత కూడా తమకే దక్కిందన్నారు. అంతేకాదు ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను రాష్ట్రపతిని చేశామన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్​ పార్టీలు ఎంఐఎంను అడ్డుపెట్టుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. మంత్రులు ఓల్డ్‌ సిటీకి వెళ్లాలంటే అసదుద్దీన్‌ అనుమతి తీసుకొని పర్యటించాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. మజ్లిస్‌ పార్టీ ప్రాభల్యం ఉన్న ప్రాంతాల్లో కరెంట్‌ బిల్లులు కట్టరని, వారిని అడిగే ధైర్యం కూడా అధికారులకు లేదన్నారు. ఎంఐఎం రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని ప్రోత్సహిస్తుందని కిషన్​రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆరోపించారు.

Isreal PM : The war has entered the second phase Isreal PM : యుద్ధం రెండో దశకు చేరుకుంది

0

– ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: యుద్ధం రెండో దశలోకి చేరిందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. భూతల పోరాటం విస్తరణతో హమాస్‌ స్థావరాలను ధ్వంసం చేస్తున్నట్లు శనివారం సాయంత్రం ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి గాల్లాంట్‌ ఆయన వెంట ఉన్నారు. ఈ ఆపరేషన్‌ను ఇజ్రాయెల్‌ వార్‌ కేబినెట్‌, సెక్యూరిటీ కెబినెట్‌ల ఏకాభిప్రాయంతో చేపట్టినట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. బందీలను వెనక్కి తీసుకురావాలన్న తమ లక్ష్యానికి భిన్నంగా భూతల దాడులు ఉండవని చెప్పారు. ‘మా కమాండర్లు, సైనికులు శత్రు భూభాగంలో ఉండి పోరాడుతున్నారు. వారికి దేశం, దేశ నాయకత్వం అండగా ఉన్నాయి. మన ఉనికిని కాపాడుకొనేందుకు, ఈ ప్రపంచం నుంచి చెడును తొలగించేందుకు వారు పోరాడుతున్నారు. మానవ జాతి కోసం అని కూడా నేను అంటాను. పౌరులను బందీలుగా చేసుకోవడం మానవ జాతిపట్ల నేరం. మా సైనికులు యుద్ధ నేరాలకు పాల్పడ్డారనడాన్ని ఆత్మవంచనగా చెబుతాను’అని ఇజ్రాయెల్‌ ప్రధాని వ్యాఖ్యానించారు.

ఇటీవల హమాస్‌ నాయకులు పిలుపునిచ్చిన ‘ఆల్‌ ఫర్‌ ఆల్‌’ డీల్‌పై కూడా ఇజ్రాయెల్‌ ప్రధాని స్పందించారు. ఈ డీల్‌ ప్రకారం ఇజ్రాయెల్‌ బందీలను విడుదల చేయాలంటే.. పాలస్తీనా బందీలను కూడా విడుదల చేయాలి. దీనిపై నెతన్యాహు మాట్లాడుతూ ‘‘ఈ విషయంపై మేం చర్చిస్తున్నాం’’ అని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. కేబినెట్‌లో చర్చించే ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన అంశాలను ఇక్కడ చెప్పడం భావ్యంకాదన్నారు. అంతేకాదు.. ఇది ఏ రకంగా ప్రయోజనకరం కాదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి గాల్లాంట్‌ మాట్లాడుతూ తమ ఆపరేషన్‌ దెబ్బకు గాజాలో భూమి కంపిస్తోందన్నారు. బందీలను వెనక్కి తీసుకురావడానికి ఇజ్రాయెల్‌ తన ప్రయత్నాలు మొత్తం చేస్తుందన్నారు. అది తమకు తక్కువ ప్రాధాన్యమున్న అంశం కాదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ దాడుల తీవ్రతకు హమాస్‌ దిగొచ్చి.. బందీలను విడుదల చేస్తుందన్నారు. శుక్రవారం రాత్రి భూతల దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్‌ ట్యాంకులు, కాంబాట్‌ ఇంజినీరింగ్‌ ఫోర్స్‌, ట్యాంకులు గాజాలోకి ప్రవేశించాయి. శనివారం కూడా అక్కడే ఉన్నాయి. హమాస్‌ కార్యకలాపాలు జరిపే ప్రాంతాల్లో ఇవి దాడులు చేపట్టాయి.

Nagam resigned from Congress Congress ​కు నాగం రాజీనామా

0

– నాకు టికెట్​ ఇవ్వకుండా అవమానించారు
– ప్యారాచూట్​ లీడర్లకే టికెట్​ ఇస్తారా?
– మాజీ మంత్రి నాగం జనార్ధన్​ ఆవేదన

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. నాగర్​కర్నూల్ టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్​ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ పార్టీకి రాజీనామా చేశారు. తనకు టికెట్ దక్కకకపోవడంతో తీవ్ర అసంతృప్తి గురైన నాగం కాంగ్రెస్​కు రిజైన్​ చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం నాగం జనార్ధన్​రెడ్డికి టికెట్ కేటాయించకుండా ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్​రెడ్డి కొడుకు కూచుకుల్ల రాజేశ్​రెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో నాగం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై నిప్పులు చెరిగారు. పార్టీలో సీనియర్ నేతనైనా తనను కాదని, ఇటీవల కాంగ్రెస్​లో చేరిన వారికి టికెట్ ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసిన నాగం జనార్ధన్​రెడ్డి ఇంటికి ఆదివారం మంత్రి కేటీఆర్ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించనున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

Delivery Boy : Raped a woman for delivery of goods Delivery Boy : సరుకులు డెలివరీ చేసేందుకు వెళ్లి మహిళపై అత్యాచారం

0

– పోలీసుల ముందు లొంగిపోతున్నట్లు నటించి గన్ లాక్కుని పరారీ
– నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న పోలీసులు
– గ్రేటర్ నోయిడాలో ఘటన

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్​లోని గ్రేటర్‌ నోయిడాలో దారుణం జరిగింది. నిత్యావసరాలు డెలివరీ చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టగా.. దొరికినట్టే దొరికి వాళ్ల నుంచి తుపాకీ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. చివరికి అతడిపై కాల్పులు జరిపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రేటర్‌ నోయిడాలోని హైరైజ్‌ అపార్ట్‌మెంట్‌లో ఓ మహిళ ఉంటున్నారు. ఇంటికి అవసరమైన సరకులను ఆమె ఓ యాప్‌లో ఆర్డర్‌ చేశారు. వాటిని తీసుకొని సుమిత్‌ సింగ్(23) అనే డెలివరీ బాయ్‌ ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారని నిర్ధారించుకొని, బలవంతంగా లోపలికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అతడు ఉన్న చోటును గుర్తించి, అక్కడికి వెళ్లే సరికి, వాళ్లకు లొంగిపోయినట్లు నటించాడు. అంతలోనే ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ నుంచి గన్‌ లాక్కొని పరారయ్యాడు. పోలీసులు అతడివెంట పరుగెడుతుంటే కాల్పులు జరిపాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు అతడి కాళ్లపై ఎదురుకాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు నోయిడా పోలీసులు వెల్లడించారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కోర్టు ఎదుట హాజరుపరుస్తామని తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నాడన్న కారణంతో గతంలోనూ సుమిత్‌పై కేసు నమోదైంది.

Nani: ‘Hi Nanna’ team promotions start.. Nani : ‘హాయ్​ నాన్న’టీమ్​ ప్రమోషన్లు షురూ..

0

నేచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్​గా వైరా ఎంటర్ట్​టైన్​మెంట్స్ బ్యానర్​పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కె. ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాన్ ఇండియన్ మూవీ హాయ్ నాన్న. యువ దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న ఈ లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎంటర్​టైనర్​లో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర చేస్తుండగా ఇతర పాత్రల్లో జయరాం, అంగద్ బేడీ నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మూవీపై మరిన్ని అంచనాలను పెంచాయి. హేషం అబ్దుల్ వాహబ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇక డిసెంబర్ 7న గ్రాండ్​గా పాన్ ఇండియా లెవెల్​లో ఈ సినిమాను రిలీజ్​ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మేకర్స్ షురూ చేసారు. అందులో భాగంగా హీరో నాని, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇద్దరూ కలిసి ప్రత్యేకంగా మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ ఫోటోలు రిలీజ్ చేసిన మేకర్స్, అతి త్వరలో ఫుల్ ఇంటర్వ్యూ ప్రసారం అవుతుందని తెలిపారు.