Home Blog Page 1219

Suspicious death of Sangareddy Additional Collector CC సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ సీసీ అనుమానాస్పద మృతి

0

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్‌ మాధురి వద్ద సీసీ (క్యాంప్‌ క్లర్క్‌)గా పనిచేస్తున్న గడిల విష్ణువర్ధన్‌ (44) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆదివారం ఉదయం కొండాపూర్‌ మండలం తెలంగాణ టౌన్‌షిప్‌ వద్ద పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. శనివారం మధ్యాహ్నం నుంచి విష్ణువర్ధన్‌ ఇంటికి వెళ్లలేదు. ఆయనకు భార్య శివ కృష్ణ కుమారి, కుమార్తె వైష్ణవి (18), కుమారుడు హర్షవర్ధన్‌ (16) ఉన్నారు. రాత్రి భార్య ఫోన్‌ చేస్తే విష్ణు మాట్లాడినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతో గత నెలరోజులుగా ఆయన సెలవుపై ఉన్నట్లు కలెక్టరేట్‌ వర్గాలు తెలిపాయి. విష్ణువర్ధన్‌ది హత్యా? ఆత్మహత్యా? అనేకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? దాని కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో విచారణ చేపట్టారు

Chandrababu Naidu: No contest in Telangana elections Chandrababu Naidu : తెలంగాణ ఎన్నికల్లో పోటీ వద్దు

0

– టీటీడీపీ చీఫ్​ కాసాని జ్ఞానేశ్వర్​కు చెప్పిన అధినేత చంద్రబాబు

– ఏపీలోని ప్రస్తుత పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉండాలని సూచన

ఇదే నిజం, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. శనివారం ములాఖత్‌ సందర్భంగా రాజమండ్రి జైలులో ఆయన్ను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ కలిశారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణపై దృష్టి పెట్టలేమని చంద్రబాబు చెప్పారు. ఏపీలోని పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందని తెలంగాణ నేతలకు వివరించాలని కాసానికి ఆయన సూచించారు. చంద్రబాబు నిర్ణయాన్ని తెలంగాణ నేతలకు ఆ పార్టీ సీనియర్‌ నేతలు వివరిస్తున్నారు.

Lunar eclipse: Dharmapuri and Kondagattu temples will be closed Lunar Eclipse : ధర్మపురి, కొండగట్టు ఆలయాలు మూసివేత

0

– చంద్రగ్రహణం తర్వాత

నేటి ఉదయం 9 గంటల నుంచి యధావిధిగా దర్శనాలు


ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: చంద్రగ్రహణం సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఆలయాలను శనివారం మూసివేశారు. ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం మూసివేశారు. అంతకు ముందు ఆలయంలో స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరిగి ఆలయాన్ని ఆదివారం ఉదయం వేకువ జామున తెరిచి.. సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం 9 గంటల నుంచి యథావిధిగా భక్తులను దర్శనాలకు అనుమతించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.
కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయాన్ని సైతం అర్చకులు, అధికారులు మూసివేశారు. ఆదివారం శుద్ధి, సంప్రోక్షణ తర్వాత భక్తులను ఆలయంలో స్వామివారి దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ పాక్షిక చంద్రగ్రహణం దాదాపు గంటన్నర వరకు కొనసాగింది.

షాపింగ్​ కాంప్లెక్స్​లో భారీ అగ్ని ప్రమాదం

0

– చెప్పుల దుకాణంలో మంటలు
– కాలిపోయిన సామగ్రి.. శంషాబాద్​లో ఘటన

ఇదే నిజం, హైదరాబాద్: శంషాబాద్ మున్సిపల్ కేంద్రం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని దేవ చెప్పుల దుకాణంలో ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేశారు. అప్రమత్తమైన స్థానికులు సామగ్రి ని బయటకు తీసుకువచ్చారు. విద్యుత్‌ షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగిందని యజమాని తెలిపాడు. రూ.28 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు పేర్కొన్నాడు.

KTR: We will cancel the Kamareddy Master Plan KTR : కామరెడ్డి మాస్టర్​ ప్లాన్​ను రద్దు చేస్తం

0

– రైతు జేఏసీకి మంత్రి కేటీఆర్ హామీ

ఇదే నిజం, హైదరాబాద్: కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనను రద్దు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కామారెడ్డి రైతుల జేఏసీ బృందం శనివారం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపాదనను రద్దు చేస్తామని.. గతంలోనే రద్దు చేస్తున్నట్లు మున్సిపల్‌ శాఖ తెలిపిన విషయాన్ని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం చేసిందన్నారు. ఈ విషయంపై డీటీసీపీ అధికారులతో మాట్లాడి.. ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే నడుచుకోవాలని సూచించారు. అలాగే రైతు జేఏసీ నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను సైతం సానుకూలంగా పరిశీలించి.. ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేసుల వివరాలను ఎస్పీతో మాట్లాడి తెలుసుకున్నారు. అలాగే ఈ అంశంపై డీజీపీ అంజనీకుమార్‌తోనూ మాట్లాడారు. అనంతరం మంత్రి కేటీఆర్‌కు రైతు జేఏసీ ధన్యవాదాలు తెలిపింది.

Gottimukkala’s resignation to Congress.. tears Congress కు గొట్టిముక్కల రాజీనామా.. కంటతడి

0

కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్‌ నేత గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా ప్రకటించారు. సెకండ్ లిస్ట్​లో తనకు టికెట్‌ దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన శనివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్​ సెకండ్​ లిస్ట్​లో భాగంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే టికెట్‌ను శేరిలింగంపల్లికి చెందిన బండి రమేశ్‌కు పార్టీ కేటాయించింది. దీంతో ఆ స్థానం నుంచి టికెట్‌ ఆశించిన గొట్టిముక్కల కంటతడి పెడుతూ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

Elections: Tears for not getting a ticket Elections : టికెట్ దక్కలేదని కంటతడి

0

-ఎల్లారెడ్డి కాంగ్రెస్ సీటు ఆశించిన వడ్డేపల్లి సుభాశ్ రెడ్డి

-రెండో జాబితాలో మదన్ మోహన్ కు టికెట్ కేటాయించిన అధిష్ఠానం

-బోరున విలపించిన సుభాశ్ రెడ్డి.. పార్టీకి రాజీనామా

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా కోపంతో రగిలిపోతున్నారు. పార్టీ అధిష్ఠానంపై నిప్పులు చెరుతున్నారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తున్న నేతలకు కాకుండా ఇతరులకు టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం టీ కాంగ్రెస్ రెండో జాబితాలో టికెట్ దక్కలేదనే ఆవేదనతో కొంతమంది పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల వేళ నేతల రాజీనామాలు కాంగ్రెస్‌లో ఆందోళన కల్గిస్తున్నాయి. అధిష్ఠానం టికెట్ రాని నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా పార్టీని వీడాలని నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా వడ్డేపల్లి సుభాశ్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఎల్లారెడ్డి సీటును ఆయన ఆశించారు. కానీ రెండో జాబితాలో మదన్ మోహన్‌కు టికెట్ కేటాయించారు. దీంతో ఆయన శనివారం అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తనకు టికెట్ రాలేదని కంటతడి పెట్టుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

The teaser of ‘Sapthasagara Daati Side-B’ is interesting. Interesting గా ‘సప్తసాగరాలు దాటి సైడ్​–బి’ Teaser

0

కన్నడ టాలెంటెడ్ హీరో రక్క్షిత్ శెట్టి హీరోగా రుక్మిణి వసంత్​ హీరోయిన్​గా నటించిన రీసెంట్ సెన్సేషన్ హిట్ చిత్రం ‘సప్త సాగరాలు దాటి – సైడ్ ఏ’. కన్నడలో భారీ హిట్​గా నిలిచిన ఈ మూవీ తెలుగులోకి డబ్​ అయ్యి ఇక్కడా మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే, సినిమా నేరేషన్ అక్కడక్కడా కాస్త స్లోగా ఉనప్పటికీ కాన్సెప్ట్​ కాస్త డిఫరెంట్​గా ఉండటంతో పాటు రక్షిత్, రుక్మిణి యాక్టింగ్​ సినిమాకు ప్లస్​ పాయింట్​గా మారింది. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ‘సప్త సాగరాలు దాటి సైడ్–బి’మూవీకి సంబంధించిన టీజర్​ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. దర్శకుడు హేమంత్ రావ్ తెరక్కెక్కించిన ఈ సినిమా టీజర్​లో ఫస్ట్ పార్ట్​లోని సోల్​ను ఎక్కడా మిస్ చేయకుండా ఓ బ్యూటిఫుల్ కట్​తో దింపారు. రక్షిత్ శెట్టి జైలులో ఉన్న సీన్​తో స్టార్ట్ అయ్యి తన ప్రేయసి చెప్పే మాటలు వింటున్నట్టుగా డిజైన్ చేసిన సీక్వెన్స్ బావుంది. అయితే, ఈ సీన్​లో తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో డైలాగ్స్ పెట్టడం సింగిల్ టీజర్​లో ఇంట్రెస్టింగ్ పాయింటనేచెప్పాలి. ఇక ఈ అవైటెడ్ సినిమా అయితే సౌత్ ఇండియా భాషల్లో నవంబర్ 17న రిలీజ్ కాబోతుంది.

ఖైదీ సినిమా @40 Years

0

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో సూపర్​ హిట్ సినిమాల్లో ‘ఖైదీ’ఒకటి. 1983లో రిలీజైన ఈ సినిమా ఆయన కెరీర్​కు టర్నింగ్ పాయింట్. ఒక్కసారిగా చిరంజీవిని స్టార్‌ హీరోను చేసింది. ‘ఖైదీ’విడుదలై అక్టోబర్​ 28తో 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం చిరంజీవి ట్విట్టర్​లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ పెట్టారు. ‘ఖైదీ’మూవీ టీమ్​కు, తెలుగు సినీ ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ‘ఖైదీ.. నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఇది విడుదలై నేటికి 40 ఏండ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఆ సినిమా జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్‌, రచయితలు పరుచూరి సోదరులు, నా కో-స్టార్స్‌ సుమలత, మాధవీతోపాటు టీమ్‌ మొత్తాన్ని అభినందిస్తున్నా.

గొప్ప విజయాన్ని మాకు అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు’అని చిరంజీవి తెలిపారు. 1982లో విడుదలైన ‘ఫస్ట్‌ బ్లడ్’ అనే హాలీవుడ్‌ సినిమాను ఆధారంగా చేసుకుని కోదండరామిరెడ్డి ‘ఖైదీ’ని తీర్చిదిద్దారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. చిరంజీవి నటన, డ్యాన్స్​లు, ఫైట్లతో పాటు కోదండరామిరెడ్డి డెరెక్షన్, కె. చక్రవర్తి సంగీతం, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ సినిమాకు పెద్ద ఎస్సెట్​గా నిలిచాయి. ముఖ్యంగా ఈ సినిమాలో చక్రవర్తి అందించిన పాటలకు చిరంజీవి వేసిన స్టెప్పులు అప్పటి యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. హిందీ, కన్నడలోనూ ఈ సినిమాను రీమేక్‌ చేశారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి స్టార్‌ ఇమేజ్‌ అమాంతం పెరిగింది. ఇక, ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవల ఆ మూవీ పూజా కార్యక్రమం జరిగింది.

Movies : ఒకరోజు గ్యాప్​లో ఆ మూడు సినిమాలు.. డిసెంబర్​లో బిగ్గెస్ట్ క్లాష్​

0

ఈ ఏడాది ఇండియన్ సినిమా బాక్సాఫీసు వద్ద ఎన్నడూ లేని విధంగా స్టార్​ హీరోల సినిమాలు బిగ్గెస్ట్ క్లాష్ కానున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘సలార్’, బాలీవుడ్​ బాద్ షా షారుఖ్​ ఖాన్ నటించిన ‘డన్కి’సినిమాలు ఒక రోజు గ్యాప్​లో రిలీజ్ కాబోతున్నాయి.దీంతో ఇది ఒక ఎపిక్ బాక్సాఫీస్ క్లాష్​గా నిలవనుంది. అయితే, ఈ స్టార్ హీరోల సినిమాలకు హలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆక్వామెన్–2’నుంచి పోటీ నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డీసీ కామిక్స్ అండ్ వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్​లో తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ ‘ఆక్వా మెన్–2’. మొదట ఈ మూవీ రిలీజ్​ను డిసెంబర్ 20కి ఫిక్స్ చేశారు. కానీ ఇపుడు 22కు షిఫ్ట్ చేసినట్లుగా మేకర్స్ కన్ఫార్మ్ చేశారు. దీంతో డిసెంబర్ 20న ఆక్వామెన్–2,21న డన్కి, 22న సలార్ ఇలా ఈ మూడు సినిమాలు ఒకరోజు గ్యాప్​లో వరల్​వైడ్​గా రిలీజ్ కానుండటంతో మరింత పోటీ నెలకొంటుందనే చెప్పాలి. మెయిన్​గా సలార్ రిలీజ్ డేట్ బాగా ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పొచ్చు. మరి
ఏ మూవీ కలెక్షన్ల సునామీ క్రియేట్​ చేస్తోందో వేచి చూడాలి.