Home Blog Page 1221

#TSGENCO #TSTransco #Supreme : తెలంగాణ జెన్​ కో, ట్రాన్స్​ కోకు కోర్టు ధిక్కరణ నోటీసులు

0

విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్ కో), విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్ కో)లకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసింది.

జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీఎసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, కార్పొరేట్ ఆఫీస్ అధికారి గోపాలరావులకు నోటీసులను ఇచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకోవట్లేదంటూ 84 మంది విద్యుత్ ఉద్యోగులు వేసిన వ్యాజ్యాన్ని ఇవ్వాళ సుప్రీంకోర్టు విచారించింది.

ధర్మాధికారి నివేదిక ప్రకారం 1,150 మంది విద్యుత్ ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయించారు.

అందులో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 655 మందిని విధుల్లోకి తీసుకుంది.

తెలంగాణ ప్రభుత్వమూ తీసుకున్నా.. 84 మందిని మినహాయించి విధుల్లోకి తీసుకుంది.

దీంతో ఆ ఉద్యోగులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. అధికారులకు నోటీసులిచ్చి విచారణను జులై 16కి వాయిదా వేసింది.

#IT rules : కొత్త ఐటీ నిబంధనలు.. దేశ చట్టాలు అమలు చేయాల్సిందే

0

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు, భారతదేశ చట్టాలను తప్పక అమలు చేయాల్సిందేనని ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం..

సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌,  సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌కు తేల్చి చెప్పింది.

అలాగే వినియోగదారుల గోప్యతను కాపాడి పటిష్ఠ భద్రత కల్పించేందుకు కఠినమైన విధానాల్ని అమలు చేయాలని స్పష్టం చేసింది.

సామాజిక మాధ్యమాల్లో పౌరుల రక్షణ, ఆన్‌లైన్ వేదికల దుర్వినియోగ నియంత్రణపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ-ఐటీ నేడు భేటీ అయ్యింది.

దీనికి హాజరు కావాలని ఫేస్‌బుక్‌, గూగుల్‌కు సోమవారమే నోటీసు ఇచ్చారు.

ఫేస్‌బుక్‌ తరఫున పబ్లిక్‌ పాలసీ విభాగం డైరెక్టర్‌ శివనాథ్‌ తుక్రల్‌, అసోసియేట్‌ జనరల్‌ కౌన్సిల్‌ నమ్రతా సింగ్‌ కమిటీ ముందు హాజరయ్యారు.

గూగుల్‌ తరఫున ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్‌ పాలసీ చీఫ్‌ అమన్‌ జైన్‌, న్యాయ విభాగం డైరెక్టర్‌ గీతాంజలి దుగ్గల్‌ కమిటీ ముందుకు వచ్చారు.

కొత్త ఐటీ నిబంధనలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు, కోర్టు తీర్పులను సైతం అమలు చేయాలని కమిటీ స్పష్టం చేసింది.

వినియోగదారుల సమాచారాన్ని భద్రపరచడంలో ఇరు సంస్థల విధానాల్లో లోపాలున్నాయని తెలిపింది.

#PCC #CONGRESS : రేవంత్‌కే పీసీసీ పగ్గాలు

0

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని ఏఐసీసీ ప్రకటించింది. వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఐదుగురుని నియమించింది.

అజారుద్దీన్‌, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్‌గౌడ్‌‌లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. 

ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీని నియమించింది. 

ప్రచారకమిటీ కన్వీనర్‌గా సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యాచరణ అమలు కమిటీ చైర్మన్‌గా మహేశ్వర్‌ రెడ్డి నియమితులయ్యారు.

సీనియర్‌ ఉపాధ్యక్షులుగా సంభాని చంద్రశేఖర్‌, దామోదర్‌రెడ్డి, మల్లు రవి, పొదెం వీరయ్య, సురేష్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, రమేష్‌ ముదిరాజ్‌, గోపీశెట్టి నిరంజన్‌, టి.కుమార్‌రావు, జావెద్‌ అమీర్‌‌లను ప్రకటించింది. 

#Aliens : వాళ్లకు మనమే ఏలియన్స్‌

0

అనంత విశ్వంలో మనిషి ఒంటరి జీవా? గ్రహాంతరవాసులు ( Aliens ) ఉన్నారా? లేరా? ఎన్నో ఏండ్లుగా మానవాళికి అంతుచిక్కని రహస్యం ఇది.

అయితే, ఏలియన్స్‌ (గ్రహాంతరవాసులు) ఉనికి కోసం మనం వెదుకుతున్నట్టే, సుదూరాల్లో ఉన్న కొందరు మన కోసం అలాగే గాలిస్తున్నారా? గత కొనేండ్లుగా మన చర్యలను నిశితంగా పరిశీలించడం ప్రారంభించారా? అమెరికా పరిశోధకులు తాజాగా చెబుతున్న విషయాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

భూగ్రహంపై ఉన్నట్లే సుదూరాన ఉన్న కోట్లాది నక్షత్ర మండలాల్లోని గ్రహాల్లో జీవం ఉండొచ్చని అమెరికాలోని కార్నెల్‌ కార్ల్‌ సగన్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ లీసా కాల్టేనెగర్‌ అభిప్రాయపడుతున్నారు.

సౌరకుటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీకి 326 కాంతి సంవత్సరాల దూరం పరిధిలో 2,034 నక్షత్ర మండలాలు ఉన్నట్టు ఆమె తెలిపారు. భూమిపై నాగరికత ప్రారంభమైన 5 వేల ఏండ్ల క్రితం నుంచి దాదాపు 1,715 నక్షత్ర మండలాలు ఎర్త్‌ ట్రాన్సిట్‌ జోన్‌ (ఈటీజడ్‌-గ్రహాన్ని గుర్తించేందుకు అవసరమైన దూరం) పరిధిలోకి వచ్చినట్టు పేర్కొన్నారు.

ఈ నక్షత్ర మండలాల్లో వేలాది గ్రహాలు ఉన్నాయన్నారు. అందులోని 29 గ్రహాలు నీరు, రాళ్లతో నిండి ఉన్నట్టు గుర్తించామన్నారు. దీంతో ఆయా గ్రహాల్లో జీవం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు.

ఈటీజడ్‌ పరిధిలోకి వచ్చిన సమయంలో ఆ గ్రహాల్లోని ఏలియన్స్‌.. భూమి మీదనున్న మనుషులను గమనించే అవకాశం లేకపోలేదని వివరించారు. అప్పుడు వాళ్లకు మనం ఏలియన్స్‌గా కనిపిస్తామన్నారు.

‘ట్రాన్సిట్‌ పద్దతి’ ద్వారా ఈ అంచనాకు వచ్చామని పేర్కొన్నారు. అయితే, అక్కడి గ్రహాంతరవాసులు నాగరికులై, సాంకేతికంగా ఉన్నతంగా ఉంటేనే భూమిపై మనుషుల ఉనికిని గుర్తించగలరని అధ్యయనంలో పాల్గొన్న మరో శాస్త్రవేత్త, అమెరికన్‌ మ్యూజియమ్‌ ఆఫ్‌ నేచర్‌ హిస్టరీ డైరెక్టర్‌ జాకీ ఫహెర్టీ తెలిపారు. ఈ వివరాలు ‘నేచర్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

80 ఏండ్లు ఆగాలి 

ఏలియన్స్‌ ఉనికిని గుర్తించేందుకు 1940 సంవత్సరం నుంచి రోదసిలోకి శాస్త్రవేత్తలు శక్తివంతమైన రేడియో, విద్యుదయస్కాంత తరంగాలను పంపిస్తున్నారు. ఒకవేళ, ఆ సిగ్నళ్లకు స్పందించి, ఏలియన్స్‌ తిరిగి మనకు సమాధానం పంపిస్తే.. ఆ సమాచారం మనకు చేరడానికి మరో 80 ఏండ్లు (2101 సంవత్సరం) పడుతుంది.

అంతరిక్షం నుంచి గుర్తుతెలియని కొన్ని సిగ్నళ్లను గతంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి ఏలియన్స్‌ పంపించినవి కావొచ్చని భావిస్తున్నారు. అయితే, దీన్ని అధికారికంగా ధ్రువపర్చలేదు.

ట్రాన్సిట్‌ పద్ధతి

నక్షత్రం చుట్టూ గ్రహం తిరిగే మార్గం, గ్రహం వ్యాసం, పరిణామక్రమం, వాతావరణం, ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఉపయోగించే సాంకేతికతను ‘ట్రాన్సిట్‌ పద్ధతి’ అంటారు.

దీంట్లో భాగంగా నక్షత్రం విడుదల చేసే కాంతి గ్రహం ఉపరితలంపై పడినప్పుడు ఆ స్టెల్లార్‌ స్పెక్ట్రమ్‌ను (వక్రీభవనం, పరావర్తనం వంటి కాంతి ధర్మాలు) హై-రెజల్యూషన్‌ సాంకేతికత కలిగిన టెలిస్కోప్‌లతో విశ్లేషిస్తారు. ఈ విధంగా గ్రహాలు, నక్షత్రాలకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటారు.

#KCR : కొత్త లేఅవుట్‌లకు అనుమ‌తివ్వొద్దు

0

క‌లెక్ట‌ర్ల అనుమ‌తి లేకుండా కొత్త లేఅవుట్‌లను అనుమ‌తించొద్దు అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

నూత‌న చ‌ట్టాల్లోని నిబంధ‌న‌ల‌ను విధిగా అమ‌లు ప‌ర‌చాల‌ని ఆదేశించారు.

వ‌ల‌స కార్మికుల పాల‌సీని రూపొందించాల‌ని కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు.

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై అధికారుల‌తో సమీక్ష సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలి

ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో భాగంగా ప‌ట్ట‌ణాల వారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో రిటైర్డు ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితా తయారు చేసి ప‌ల్లెప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల్లో వారి సేవ‌లు వినియోగించుకోవాల‌ని సూచించారు.

జులై చివ‌రి నాటికి ప్ర‌భుత్వ శాఖ‌ల మ‌ధ్య పేరుకుపోయిన బ‌కాయిల‌ను బుక్ అడ్జ‌స్ట్‌మెంట్ ద్వారా ప‌రిష్క‌రించాలి.

ఇక‌పై అన్ని శాఖ‌ల మ‌ధ్య వెంట వెంట‌నే బిల్లుల చెల్లింపులు జ‌ర‌గాల‌ని చెప్పారు.

క‌నీసం ఐదు డంపు యార్డులు

భ‌విష్య‌త్ త‌రాల‌ను, తెలంగాణ ప‌ట్ట‌ణాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్ర‌తి ప‌ట్ట‌ణంలో క‌నీసం ఐదు డంపు యార్డులు ఏర్పాటు చేయాల‌ని సీఎం ఆదేశించారు.

ప‌ట్ట‌ణాల‌కు ద‌గ్గ‌ర‌లో డంప్ యార్డుల‌కు స్థలాలు సేక‌రించాల‌ని సూచించారు.

హైద‌రాబాద్ కాస్మోపాలిట‌న్ న‌గ‌రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, అందుకు అనుగుణంగా హెచ్ఎండీఏ ప‌రిధిలో ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.

తాగునీరు, రోడ్లు త‌దిత‌ర మౌలిక వ‌సతుల అభివృద్ధి కోసం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు.

ల‌క్ష జ‌నాభాకు వెజ్‌, నాన్ వెజ్ మార్కెట్

నూత‌న స‌మీకృత జిల్లా క‌లెక్ట‌రు కార్యాల‌యాల‌కు త‌ర‌లుతున్నందున ప్ర‌భుత్వ కార్యాల‌యాల స్థలాలు, ఆస్తుల‌ను క‌లెక్ట‌ర్లు స్వాధీనం చేసుకోవాలని సీఎం ఆదేశించారు.

ఆ స్థలాల‌ను ప్ర‌జా అవ‌స‌రాల కోసం వినియోగించాల‌ని తెలిపారు.

ల‌క్ష జ‌నాభాకు ఒక‌టి చొప్పున క‌నీసం 3 ఎక‌రాల స్థ‌లంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల‌ను నిర్మించి పార్కింగ్, త‌దిత‌ర సౌక‌ర్యాలు క‌ల్పించాల‌న్నారు.

ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాలో భాగంగా ప‌ట్ట‌ణాల‌ను తీర్చిదిద్దుకునేందుకు 10 రోజుల స‌మ‌యాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అధికారులు వినియోగించుకోవాలి అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

#THR #HarishRao : మంత్రి హరీష్ రావు కాన్వాయికి ప్రమాదం.. త‌ప్పిన ప్ర‌మాదం

0

సిద్దిపేటలో ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌, ఇత‌ర అభివృద్ది ప‌నుల ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మాల‌ను ముగించుకుని హైదరాబాద్ వెళ్తుండగా మంత్రి హ‌రీష్ రావు కాన్వాయ్ ప్ర‌మాదానికి గుర‌యింది.

కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న కారుకు అడవి పందులు అడ్డు రావ‌డంలో డ్రైవ‌ర్‌ సడెన్ గా బ్రేక్ వేయాల్సివ‌చ్చింది.

ఆ కారుకు వెనుకనే వ‌స్తున్న మంత్రి కూర్చున్న వాహ‌నం ముందు వాహ‌నాన్ని డీకొట్టింది.

దీంతో కారులోని సిబ్బందిలోని ఓ వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి.

గాయాపాలయిన వ్యక్తిని ఆసుపత్రికి పంపించి మరోకారులో హైద్రాబాద్ వెళ్లారు మంత్రి హరీష్ రావు.

ఈ ప్ర‌మాదంలో కారు ముందు భాగం కొంత ధ్వంసం అయింది. కొండపాక మండలం బంధారం దర్గా కమాన్ సమీపంలో ప్ర‌మాదం జ‌రిగింది.

#KCR : మూతికో బట్ట.. ముడ్డికో గుడ్డ.. ఇదేం ఖర్మ, వాళ్లని దొరకబట్టి బండకు కొట్టుర్రి

0

‘‘ఇప్పుడు మరో బాధ వచ్చిపడింది. మూతికో బట్ట.. ముడ్డికో బట్ట.. కట్టుకొని నానా ఇబ్బంది పడుతున్నాం. పెళ్లికి పోతే ఎవరు ఏ చుట్టమో అర్థం కాక కొద్దిగా మాస్కు తియ్యమంటున్నరు.’’ అని కేసీఆర్ చమత్కరించారు.

రాష్ట్రంలో మరో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు తెస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఎల్లప్పుడూ గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులతోనే ఏమీ కావట్లేదని అందుకే కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. ‘‘ఇప్పుడు మరో బాధ వచ్చిపడింది.

మూతికో బట్ట.. ముడ్డికో బట్ట.. కట్టుకొని నానా ఇబ్బంది పడుతున్నాం. పెళ్లికి పోతే ఎవరు ఏ చుట్టమో అర్థం కాక కొద్దిగా మాస్కు తియ్యమంటున్నరు.

అది తీస్తే మనం కరోనాకు దొరికే పరిస్థితి ఉంది. ఇట్లనే ఆఖరికి నాక్కూడా వచ్చింది కరోనా.’’ అని కేసీఆర్ చమత్కరించారు.

ఆదివారం సీఎం కేసీఆర్ సిద్దిపేట కలెక్టరేట్‌ ప్రారంభం సందర్భంగా మాట్లాడారు.

రాష్ట్రంలోని అన్ని చోట్ల దాదాపు 98.6 గ్రామాల్లో వైకుంఠధామాలు కట్టడం పూర్తయిందని గుర్తు చేశారు.

ఆక్సీజన్ ఎవరైనా కొనుక్కుంటారా ఎవడైనా? సిగ్గుండాల మనకు. సమాజమే సిగ్గుపడాల.

నాలుగు చెట్లు పెంచితే ఇబ్బందేముంది. చెట్లు పెంచిన ప్రాంతం ఎంత బాగుంది. సిద్దిపేటలో నాలుగు వైపులా చెట్లు ఉండి రోడ్లు ఇప్పుడు ఎంత బాగున్నాయి.

ఇంకా 10 శాతం అధికారులు అలసత్వం చేస్తున్నారు. అలాంటోళ్లని దొరకబట్టి బండకు కొట్టుర్రి. ఎక్కడ నర్సరీలు లేకపోతే వాళ్లని దంచుర్రి.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు చేతులెత్తి మొక్కుతున్నా.’’ అని కేసీఆర్ మాట్లాడారు.

సమీకృత కలెక్టరేట్, కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

కలెక్టరేట్‌ను 50 ఎకరాల్లో నిర్మించారు. మరో ఎకరం విస్తీర్ణంలో రూ.4 కోట్లతో రెండు అంతస్తుల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించారు.

#Kim #NorthKoria #Food #Crisis : ఉత్తర కొరియాలో తీవ్ర క‌రువు.. రేట్లు చూస్తే ద‌డుసుకోవాల్సిందే..

0

నిరంతరం అణ్వాయుధాల ప్రయోగాలతో ప్రపంచ దేశాలు ముఖ్యమంగా అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహానికి గురయిన ఉత్తర కొరియాపై ఆంక్షలు కొనసాగుతుండగా… పులిమీద పుట్రలా కరోనా మరింత దెబ్బతీసింది.

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా పేద దేశాలు ఆహార, ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ముఖ్యంగా ఉత్తర కొరియాలో సంక్షోభం ఏర్పడవచ్చనే ఐరాస నివేదికలు నిజమవుతున్నాయి.

దేశంలో పరిస్థితులపై అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తొలిసారి స్పందించారు.

రెండు రోజుల కిందట జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో కిమ్‌ మాట్లాడుతూ.. ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

సంక్షోభ నివారణకు ఆహార ఉత్పత్తులను గణనీయంగా పెంచే మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ఆంక్షలు మరికొంతకాలం కొనసాగుతాయని, వాటికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు కిమ్‌ పిలుపునిచ్చారు.

కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతుంటే ఉత్తర కొరియా మాత్రం తమ దేశంలో ఒక్క కేసు కూడా నమోదుకాలేదని చెబుతోంది.

చైనాలో కోవిడ్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలోనే ఆ దేశంతో సరిహద్దులను మూసివేసింది.

ఏడాదిన్నరగా సరిహద్దులను మూసివేయడంతో పాటు కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తోంది.

చైనాతోనూ వాణిజ్య కార్యకలాపాలను నియంత్రించడంతో ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించినట్లు సమాచారం.

దీనికి తోడు గతేడాది అక్కడ సంభవించిన తుఫాన్లు, వరదలతో ఆహారోత్పత్తి దెబ్బతింది.

ఆంక్షలు, ప్రకృతి వైపరిత్యాల కారణంగా ఉత్తర కొరియా లక్షల టన్నుల ఆహార కొరతను ఎదుర్కోనుందని దక్షిణ కొరియాకు చెందిన కొరియన్ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇటీవల వెల్లడించింది.

దీంతో దేశ ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితులు నెలకొంటున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఉత్తర కొరియాలో ఒక బ్లాక్‌ టీ ప్యాకెట్‌ ధర రూ.5 వేలు, కాఫీ ప్యాకెట్‌ ధర రూ.7 వేలు, కిలో అరటిపండ్ల ధర 3వేలకు పైనే (45డాలర్లు).

ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి.

ముఖ్యంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఊహించని విధంగా పెరిగిపోయాయి.

ఉత్తర కొరియా దాదాపు 8 లక్షల 60 వేల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార విభాగం (FAO) అంచనా వేసింది. ఇది ఆ దేశానికి రెండు నెలలపాటు సరిపోయే అహార పదార్థాలతో సమానం.

ఇన్నాళ్లూ రసాయన ఎరువుల కోసం చైనాపై ఆధారపడిన ఉత్తర కొరియా.. దిగుమతులపై ఆంక్షల వల్ల తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది.

దీనికి ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువుల తయారు చేసి, సమస్యను అధిగమించాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా కంపోస్టులో కలిపేందుకు నిత్యం దాదాపు రెండు లీటర్లు మూత్రాన్ని ఇవ్వాలని అక్కడి రైతులకు ఉత్తరకొరియా అధికారులు సూచించినట్టు అమెరికాకు చెందిన రేడియో ఫ్రీ ఆసియా అనే మీడియా గతనెలలో వెల్లడించింది.

#Trump : కరోనాతో భారత్‌కు తీవ్ర న‌ష్టం.. న‌ష్టం చైనా బ‌రించాల్సిందే..

0

కరోనా వైరస్ విషయంలో ముందు నుంచి చైనాపై విమర్శలు గుప్పిస్తోన్న అమెరికా మాజీ అధ్యక్షుడు మరోసారి డ్రాగన్‌పై నిప్పులు చెరిగారు.

పదవి నుంచి దిగిపోయిన తర్వాత తొలిసారిగా భారత్‌లో కరోనా వైరస్ పరిస్థితుల గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఫ్యాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ కారణంగా భారత్నా శమయ్యిందని, కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడానికి చైనా కారణమని ఆరోపించారు.

ఇందుకు అమెరికాకు చైనా 10 ట్రిలియన్ డాలర్లు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

వాస్తవానికి చైనా ప్రపంచం మొత్తానికి పరిహారంగా ఇంత కంటే ఎక్కువ చెల్లించాలి, కానీ వారి సామర్థ్యం ఇదేనని ట్రంప్ అన్నారు.

‘‘చెల్లించాల్సిన దాని కంటే సంఖ్య (పరిహారం) చాలా ఎక్కువ. కానీ అమెరికాకు చెల్లించాల్సింది చాలా ఉంది… ప్రపంచవ్యాప్తంగా చాలా చెల్లించాలి.. వారి నిర్వాకంతో దేశాలు నాశనమయ్యాయి.. ప్రమాదవశాత్తు జరిగిందని నేను ఆశిస్తున్నాను.. ఇది అసమర్థత లేదా ప్రమాదం ద్వారా జరిగిందని భావిన్నాను’’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘కానీ, ఇలా చూసినప్పుడు అది ప్రమాదవశాత్తు జరిగిందా? ఇంకేమైనా కావచ్చు.. తీవ్రంగా ప్రభావితమైన ఈ దేశాలను చూడండి… వారు ఎప్పటికీ కోలుకోలేరు.. మన దేశం చాలా తీవ్రంగా నష్టపోయింది..

కానీ ఇతర దేశాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి.. భారత్‌నే తీసుకుంటే ఆ దేశంలో ఎన్నడూలేని విధంగా ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడింది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

‘‘ఇప్పుడు భారత్‌లో ఏం జరుగుతుందో చూడండి.. మీకు తెలుసా వారు చెప్పేది ఏమిటంటే.. భారతదేశం ఎంతగానో శ్రమిస్తోంది.. ఎందుకంటే వారు ఎప్పుడూ బయటపడటం కోసం చూస్తున్నారు..

భారత్ ఇప్పుడిప్పుడే సర్వనాశనం అయ్యింది.. వాస్తవంగా ప్రతి దేశం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది’’అని ట్రంప్ ఆవేదన చెందారు.

‘‘ఇది ఎక్కడ నుంచి.. ఎలా వచ్చింది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను.

ఈ విషయం నాకు తెలుసని నేను అనుకుంటున్నాను.

నా ఉద్దేశం దాని గురించి నాకు ఖచ్చితంగా ఉంది.. అయితే చైనా సహాకరించినప్పుడే వారి ఆర్థిక వ్యవస్థ, మన ఆర్థిక వ్యవస్థ వేగంగా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి’’ అని అన్నారు.

కరోనా వైరస్ 2019 డిసెంబరులో తొలిసారిగా చైనాలోని వుహాన్ నగరంలోనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

అయితే, ఇది వుహాన్ ల్యాబ్ నుంచే లీకయ్యిందని ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్నారు. తాజాగా, మరోసారి తన వాదన వినిపించారు.

ఇప్పటి వరకూ కరోనా వైరస్ మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా 38.35 లక్షల మంది బలయ్యారు.

17.75 కోట్ల మంది వైరస్ బారినపడ్డారు. రెండో దశవ్యాప్తికి చిగురుటాకులా వణికిన భారత్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతున్నాయి.

KCR: అప్పట్లో చుక్క నీటి కోసం ఇబ్బందులు పడ్డాం… నేడు చెరువులు కళకళలాడుతున్నాయి

0

”జిల్లాల పునర్విభజన అనంతరం సిద్దిపేటలో తొలి కలెక్టరేట్ సముదాయం ప్రారంభించడం సంతోషంగా ఉంది. నేను ఇక్కడే పుట్టాను. ఇది సెంట్రల్ తెలంగాణ. దీనికి ఎంతో భవిష్యత్ ఉంది. తెలంగాణ ఉద్యమంలోనూ సిద్దిపేట అండగా ఉంది”అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌, సమీకృత కలెక్టరేట్‌, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ఆదివారం ప్రారంభించిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు.

”అప్పట్లో నీటి కోసం సిద్దిపేట ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. నీటి చుక్క కోసం చాలా శ్రమ పడ్డారు. మనిషి చనిపోయిన తర్వాత స్నానం చేయడానికి నీళ్ల కోసం ఎమ్మెల్యేకు ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి రోజుల్ని చూశాం”.

”నేడు చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. దీని కోసమే మనం తెలంగాణ సాధించుకున్నాం. చాలా గర్వంగా ఉంది”అని కేసీఆర్ అన్నారు.

సిద్దిపేట అనంతరం కామారెడ్డిలో జిల్లా పోలీసు కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు.