Homeహైదరాబాద్latest Newsతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు: ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు: ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

ఇదేనిజం, శేరిలింగంపల్లి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీ కాలనీలోగల పోచమ్మ దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రావణ మాస బోనాల ఉత్సవాలలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణరాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తుందని ఆ అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రావు, నాగమణి, రఘునాథ్ రెడ్డి, మిరియాల రాఘవరావు, మంత్రి ప్రగడ సత్యనారాయణ, యాదగిరి గౌడ్, శ్రీనివాస రాజు, శ్రీనివాస్ నాయక్, నరేందర్ బల్లా తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img