Homeహైదరాబాద్latest NewsBREAKING: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్.. హస్తం గూటికి చేవెళ్ల ఎమ్మెల్యే..!

BREAKING: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్.. హస్తం గూటికి చేవెళ్ల ఎమ్మెల్యే..!

బీఆర్‌ఎస్‌కు మరో పెద్ద షాక్ తగిలింది. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నేత, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌లో చేరారు. దిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్‌ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. కాలె యాదయ్యకు సీఎం రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అయితే చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాలె యాదయ్య వరుసగా మూడుసార్లు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్‌ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఆయన.. గత అసెంబ్లీ ఎన్నికల్లో 268 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.

Recent

- Advertisment -spot_img