ఇదే నిజం, ఖమ్మం: క్యాబినెట్ విస్తరణలో భాగంగా మంత్రి పొంగిలేటి కి హోంశాఖ అదనపు బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం. క్యాబినెట్ విస్తరణలో హోం శాఖ పొంగిలేటికి కేటాయించాలని భావిస్తున్నట్లు అధిష్టాన పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారని తెలుస్తుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ గారు, తెలంగాణ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీల ప్రమాణ స్వీకారానికి ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాంరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పొరిక బలరాం నాయక్, TSEWIDC ఛైర్మన్ మువ్వ విజయ్ బాబు, డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ జాటోత్ రాంచందర్ నాయక్ లతో సీఎం రేవంత్ రెడ్డి కలిసి హాజరయ్యారు. లోక్సభ గ్యాలరీలో కూర్చుని వీరందరూ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ ఢిల్లీ పర్యటనలో అతి ముఖ్యమైన విషయాలు చర్చించబోతున్నారు.