మహబూబాబాద్ జిల్లాలో నకిలీ సీఎంఆర్ఎఫ్ బిల్లుల దందాలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఆయన అనుచరులు ఉన్నట్లు తేలింది. ఈ మేరకు మానుకోటలోని రెండు ప్రముఖ ఆస్పత్రుల్లో సీఐడీ విచారణ చేపట్టింది. సీఎంఆర్ఎఫ్ నకిలీ బిల్లులు సృష్టించిన సూత్రధారులపై అధికారులు ఆరా తీస్తున్నారు. నకిలీ సీఎంఆర్ఎఫ్ లెటర్లతో మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కోట్లు దండుకున్నట్లు తెలుస్తోంది.