Homeజిల్లా వార్తలురైతుల పక్షాన పోరాడితే అక్రమ అరెస్టులు చేస్తారా?.. తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట...

రైతుల పక్షాన పోరాడితే అక్రమ అరెస్టులు చేస్తారా?.. తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

ఇదే నిజం, ముస్తాబాద్: భారత రాష్ట్ర సమితి తెలంగాణ రైతాంగం ‘చలో ప్రగతి భవన్’ కార్యక్రమానికి పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ముస్తాబాద్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి లను అక్రమంగా అరెస్టు చేసి ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఈ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించినారు. అరెస్టు అయిన కార్యకర్తలతో మాట్లాడి రైతాంగ సమస్యల పట్ల పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేసి, రైతులందరికీ భరోసా ఇవ్వకుంటే.. కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని అన్నారు.

Recent

- Advertisment -spot_img