Homeహైదరాబాద్latest Newsఆ ఆలోచనలో BRS లేదు

ఆ ఆలోచనలో BRS లేదు

– బండి నోటికొచ్చినట్లు బురదజల్లుడు మానుకోవాలి
– బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటి కావాలని సంజయ్ మాట్లాడటం విడ్డురం
– కరీంనగర్ మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్

ఇదే నిజం, ప్రధాన ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చుతారని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ALSO READ: ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇళ్లు లేనివారికి రూ.5లక్షలు.. 

బుధవారం సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య ఇంటింటో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుందని బండి సంజయ్ హెచ్చరిక చేయడం, కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేద్దామని మాట్లాడడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. బండి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీఆర్ఎస్ కు లేదని, 39 మంది ఎమ్మెల్యేలు, శాసనమండలిలో మెజారిటీ సభ్యులతో బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షంగా ఉందని స్పష్టం చేశారు.

Read More : తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతు BRS: కేటీఆర్

బీఆర్ఎస్ ప్రజాసమస్యలపై పోరాటం చేస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ పై బండి చేస్తున్న ఆరోపణలు సరికాదని, ఆయన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లు ప్రజల ఆశీర్వాదంతో పని చేసిందని, దేశ చరిత్రలో ఏ ప్రభుత్వాలు చేయలేని రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు ₹10 వేల పెట్టుబడి సాయం, రైతుబీమాతో రైతులు మరణిస్తే ₹5 లక్షల సాయం, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ ద్వారా ఆడబిడ్డ పెళ్లికి ₹లక్ష 116 సాయం చేసిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యాసంగి నుంచి క్వింటాలుకు ₹500, రైతుభరోసాతో ₹15000, కల్యాణలక్ష్మీతో ₹ లక్షతో పాటు తులం బంగారం, 2 లక్షల రుణమాఫీ వంటి హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారని పేర్కొన్నారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్న కాంగ్రెస్ హామీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పై ప్రజలు ఎన్నో ఆశలతో ఓట్లు వేశారని, ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img