ఉత్తరప్రదేశ్, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో నవంబర్ 13 నుంచి జరగాల్సిన ఉప ఎన్నికలను ఎన్నికల సంఘం నవంబర్ 20కి వాయిదా వేసింది. వివిధ ఉత్సవాల కారణంగా ఈ రాష్ట్రాల్లో తేదీలను మార్చాలని జాతీయ, రాష్ట్ర పార్టీలు ECని అభ్యర్థించాయి. వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక జరిగే తేదీలను మార్చింది. ఇతర రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రకారమే ఉప ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది.