Sugar patients : షుగర్ పెషేంట్స్ చక్కెరకు బదులు తేనె వాడొచ్చా..?
Sugar patients – డయాబెటిస్(షుగర్) ఉన్నవాళ్లు టీ, కాఫీలలో షుగర్‌కి బదులుగా తేనె కలుపుకోవచ్చు అని చాలామంది నమ్ముతారు.
షుగర్ ఉన్నా చక్కెరకు బదులు తేనెని ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువే.
తేనె వాడితే షుగర్ లెవెల్స్ పెరగవు అనే మాట సరైంది కాదని న్యూట్రిషియన్లు చెబుతున్నారు.
నిజానికి తేనెకీ షుగర్‌కీ పెద్దగా తేడా లేదంట. ఇవి రెండూ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని ఎఫెక్ట్ చేస్తాయి.
కాకపోతే చక్కెర కంటే తేనె ఎక్కువ తియ్యగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా తేనె కలిపితే సరిపోతుంది.
దీనివల్ల లోపలికి వెళ్లే షుగర్ కంటెంట్ తగ్గుతుంది అంతే. పనితీరులో మాత్రం రెండు కూడా షుగర్ పెషేంట్లకు ఇబ్బంది పెంచేవే.
తేనెకి పంచదార అంత రిఫైండ్ ప్రాసెస్ ఉండదు కాబట్టి చక్కెర వాడాల్సి వచ్చినప్పుడు తేనె ఒక ఆల్టర్నేటివ్‌గా పనిచేస్తుంది.
అంతే తప్ప తేనె వల్ల షుగర్ పెరగకుండా మాత్రం ఉండదు.
అందుకే డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ కంటే తేనె మంచిదే అనుకోవటానికి వీల్లేదు.
టీ కాఫీలలో ఎక్కువ మోతాదు తేనె వేసుకునే అలవాటు ఉంటే వెంటనే తగ్గించుకోవటం మంచిది.
తేనెకీ చక్కెరకీ న్యూట్రిషన్ ప్రొఫైల్ ఒక్కటే. తేనెలో షుగర్ కంటే మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి ఫిట్నెస్ ఫ్రీక్స్‌కి తేనె వాడటం మంచిదే.. డయాబెటిక్స్ మాత్రం తేనెకి కూడా దూరంగా ఉండాల్సిందే.
ఇవి కూడా చదవండి
వీటితో బీపీ, షుగర్‌లకు చెక్ పెట్టొచ్చు.. మరెన్నో లాభాలు