ప్రస్తుత కాలంలో చాలామంది వారి వారి బిజీ లైఫ్ కారణంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే దీనిని నిర్లక్ష్యం చేస్తే అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఓ అధ్యయనంలో నిద్రలేమి వల్ల క్యాన్సర్ సైతం వచ్చే అవకాశం ఉందని తేలింది. 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారి పెద్దప్రేగులో పాలిప్స్ పెరిగి, క్రమంగా క్యాన్సర్‌గా మారుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు.