HomeజాతీయంBad Bank : బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయ‌నున్న‌ కేంద్రం.. ఏంటీ పేరు ఇలా పెట్టారు..

Bad Bank : బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయ‌నున్న‌ కేంద్రం.. ఏంటీ పేరు ఇలా పెట్టారు..

Central Government Ready to Establish Bad Bank : బ్యాడ్‌ బ్యాంక్‌ (Bad Bank) ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు కోసం రూ.30,600 కోట్ల ప్రభుత్వ హామీని ఆమోదించారు.

మొండి బకాయిల సంక్షోభం నుంచి బ్యాంకులు తట్టుకొని నిలిచేందుకు ఈ బ్యాడ్‌ బ్యాంకును ఏర్పాటుచేశారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

నేషనల్‌ అసెట్ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఆర్‌సీఎల్).. ముద్దుగా బ్యాడ్‌ బ్యాంకుగా పిలుచుకునే ఈ బ్యాంక్‌ జారీ చేసే సెక్యూరిటీ రసీదుల కోసం రూ.30,600 కోట్ల వరకు ప్రభుత్వ గ్యారెంటీని ఆమోదించినట్లు ప్రకటించారు.

ఈ హామీ ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది.

తొలి దశలో ఎన్‌ఆర్‌సీఎల్‌కు బదిలీ చేసే రూ.89, 000 కోట్ల 22 బ్యాండ్‌ లోన్‌ ఖాతాలను బ్యాంకులు గుర్తించాయి.

ప్రతిపాదిత బ్యాడ్‌ బ్యాంక్‌ రూ.500 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ విలువైన ఆస్తులను మాత్రమే పరిష్కరించేందుకు తీసుకుంటుంది.

నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ కోసం ప్రభుత్వ హామీని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది.

అంతకుముందు, నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ ప్రసంగంలో బ్యాడ్‌ బ్యాంకు ఏర్పాటు గురించి వెల్లడించారు.

బ్యాడ్‌ బ్యాంకు ప్రారంభంలో హామీ మొత్తం గరిష్టంగా రూ.31,000 కోట్లుగా నిర్ణయించారు.

ఈ బ్యాడ్‌ బ్యాంకులో లీడ్‌ స్పాన్సర్‌గా 12 శాతం స్టేక్‌తో కెనరా బ్యాంకు వ్యవహరించనున్నది.

ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని కలిసి ఎన్‌ఆర్‌సీఎల్‌లో 51 శాతంను కలిగి ఉంటాయి.

వీటిని ముంబైలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌తో కలుపుతారు.

ఎన్‌ఆర్‌సీఎల్‌ను ఏర్పాటుచేయడంపై చర్చలు తీసుకోవాలని ఇప్పటికే రిజర్వ్‌ బ్యాంకును ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది.

Recent

- Advertisment -spot_img