HomeజాతీయంE Passport | ఇక దొంగ పాస్‌పోర్ట్‌ల‌కు చెక్‌

E Passport | ఇక దొంగ పాస్‌పోర్ట్‌ల‌కు చెక్‌

E Passport | ఇక దొంగ పాస్‌పోర్ట్‌ల‌కు చెక్‌

E Passport | కుంభ‌కోణాల్లో చిక్కుకున్న వారు.. అవినీతికి పాల్ప‌డిన వారు న‌కిలీ పాస్‌పోర్టులతో దేశం నుంచి పారిపోతున్నారు.

ఇక నుంచి అలాంటి వ్య‌క్తులకు చెక్ పెట్టేలా కేంద్ర ప్ర‌భుత్వం భార‌తీయులంద‌రికీ త్వ‌ర‌లో ఈ-పాస్‌పోర్టులు జారీ చేయ‌నున్న‌ది.

భ‌విష్య‌త్ త‌ర పౌరులంద‌రికీ ఈ-పాస్‌పోర్ట్ విధానాన్ని త్వ‌ర‌లో భార‌త్ ప్రారంభిస్తుంది అని విదేశాంగ‌శాఖ కార్య‌ద‌ర్శి సంజ‌య్ భ‌ట్టాచార్య ట్వీట్ చేశారు.

ఈ- పాస్‌పోర్టుల్లో న‌మోదు చేసిన పౌరుల‌ బ‌యోమెట్రిక్ డేటా సుర‌క్షితంగా ఉండ‌టంతోపాటు అంత‌ర్జాతీయంగా ఇమ్మిగ్రేష‌న్ పోస్టుల వద్ద హాయిగా ముందుకెళ్లిపోవ‌చ్చున‌ని తెలిపారు.

Star Kisan Ghar : రైతులకు ఐటీ రిటర్న్స్ లేకుండానే 50లక్షల వరకు ఇంటి రుణం

Gothram : గోత్రం అంటే ఏమిటి? దీని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి

మైక్రోచిప్‌తో త‌యారు చేసిన పాస్‌పోర్ట్‌లో స‌ద‌రు వ్య‌క్తికి సంబంధించిన బ‌యోమెట్రిక్ డేటా మొత్తం ఉంటుంద‌న్నారు.

రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేష‌న్ (ఆర్ఎఫ్ఐడీ) ద్వారా ఎంబీడెడ్ మైక్రోచిప్‌తో ఈ-పాస్‌పోర్ట్ త‌యారు చేస్తారు.

దీంట్లో నుంచి ఆ వ్య‌క్తుల డేటా బ‌దిలీ చేయ‌డానికి వీలు కాకుండా సెక్యూరిటీ ఫీచ‌ర్లు ర‌క్ష‌ణ క‌వ‌చంగా ఉంటాయి.

మోస‌గాళ్లు డేటా దొంగిలించ‌కుండా, సంత‌కాలు పొర్జ‌రీ చేయ‌కుండా అప్‌గ్రేడెడ్ డాక్యుమెంట్ల‌తో ఈ-పాస్‌పోర్టులు ఇమ్మిగ్రేష‌న్ ప్రాసెస్‌కు క‌నెక్టివిటీ విస్తృతం చేస్తారు.

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌యోగాత్మ‌కంగా ఎంబీడెడ్ మైక్రోచిప్‌ల‌తో రూపొందించిన ఈ-పాస్‌పోర్టులు 20 వేల మంది అధికారుల‌కు పంపిణీ చేసింది.

Ginger Water : ఉద‌యం వెల్లుల్లి నీటిని తాగితే బెనిఫిట్స్‌..

Omicron Symptoms : ఒమిక్రాన్ సోకిన వారిలో ఈ ల‌క్ష‌ణాలు.. చ‌ర్మం, పెద‌వులు, గోళ్లు ..!

ఈ ప్ర‌క్రియ విజ‌య‌వంతం కావ‌డంతో పౌరులంద‌రికీ ఈ-పాస్‌పోర్టులు జారీ చేయాల‌ని నిర్ణ‌యించింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ప్రింటెడ్ బుక్‌లెట్స్‌తో ప‌ర్స‌నలైజ్డ్ పాస్‌పోర్టులు జారీ అయ్యేవి.

అంత‌ర్జాతీయ పౌర విమాన‌యాన సంస్థ (ఐసీఏవో) ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఈ-పాస్‌పోర్టులు జారీ చేస్తామ‌ని కేంద్రం 2021లో ప్ర‌క‌టించింది.

దీన్ని ధ్వంసం చేయ‌డం చాలా క‌ష్ట సాధ్యం.

పాస్‌పోర్టులో ముందు చిప్‌తోపాటు ఈ-పాస్‌పోర్టుకు గుర్తింపుగా అంత‌ర్జాతీయంగా గుర్తింపు పొందిన లోగో ఉంటుంది.

దేశంలోని 36 పాస్‌పోర్ట్ కార్యాల‌యాల్లో ఈ-పాస్‌పోర్టులు జారీ చేస్తారు.

Metabolism exercise : ఈ వ్యాయామంతో మెటబాలిజం మెరుగు.. క్యాలరీలు ఖర్చు..

Shopping Tricks : బ్రాండెడ్​ షర్టులు తక్కువ ధరకే కావాలా.. ట్రిక్స్​

Airplane drops human waste : విమానంలో బాత్‌రూమ్​ వ్యర్థాలు గాలిలోనే జనాల మీద వదిలేస్తారా

Recent

- Advertisment -spot_img