Homeలైఫ్‌స్టైల్‌Metabolism exercise : ఈ వ్యాయామంతో మెటబాలిజం మెరుగు.. క్యాలరీలు ఖర్చు..

Metabolism exercise : ఈ వ్యాయామంతో మెటబాలిజం మెరుగు.. క్యాలరీలు ఖర్చు..

Metabolism exercise : ఈ వ్యాయామంతో మెటబాలిజం మెరుగు.. క్యాలరీలు ఖర్చు..

Metabolism exercise : జిమ్‌లో చేసే ఎక్సర్‌సైజ్‌తో మ‌జిల్స్‌ను పెంచుకున్నా మ‌న శ‌రీర మెట‌బాలిజం రేటు వృద్ధి చెందుతుంది.

గంట‌ల కొద్దీమారకుండా ఒకే పొజిష‌న్‌లో కూర్చుంటే మ‌న శ‌రీర మెట‌బాలిజం తగ్గిపోతుంది.

క‌నుక మ‌ధ్య మ‌ధ్య‌లో లేచి అటు ఇటూ నడుస్తూ ఉండాలి.

మ‌న బాడీలో ఖ‌ర్చ‌య్యే క్యాల‌రీల రేటునే మెట‌బాలిజం అంటారు.

అంటే.. మెట‌బాలిజం ఎంత ఎక్కువ ఉంటే క్యాల‌రీలు అంత త్వ‌ర‌గా కరిగిపోతాయి.

కాబట్టి ప్ర‌తి ఒక్క‌రు ఆరోగ్య‌క‌ర‌మైన మెట‌బాలిజం క‌లిగి ఉండటం అవసరం.

అది ఏ మాత్రం తక్కువగా ఉన్న అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల కు దారి తీస్తుంది.

Ginger Health Benefits : అల్లంతో ఎన్ని ప్రయోజనాలో…

Reverse Walking : వ్యాయామంలో.. వెనక్కి వాకింగ్‌తో షాకింగ్ రిజ‌ల్ట్స్‌

ఇంకా చెప్పాలంటే మెట‌బాలిజం త‌గ్గితే,క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చుకావు దాని ఫ‌లితంగా బాడీలో ఫ్యాట్ పెరిగి అధిక బ‌రువు బారిన పడతారు.

అలాగే డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు కూడా వ‌స్తాయి.

క‌నుక మ‌న శ‌రీర మెట‌బాలిజం స‌రిగ్గా ఉండేలా జాగ్రత్త పడాలి.

అందుకు గాను మనం కొన్ని ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి అవేంటో తెలుసుకుందాం.

మెటాబాలిజం ఎందుకు ముఖ్యం

మెటాబాలిజం ఆరోగ్యానికి ఒక ఫౌండేషన్ లాంటిది. మానవులలో ఎవరికైతే మెటబాలిజం సరిగా ఉండదో వారిలో టోక్సిన్స్‌కు దారి తీస్తుంది. సహజంగా వచ్చే ఉత్పత్తిలో తక్కువ శక్తిని కలిగి ఉండడం వల్లే అనారోగ్యానికి కారణమౌతుంది.

వెయిట్ తగ్గడానికి మార్గాలు (Metabolism exercise)

బరువు తగ్గాలి అనుకునేవారికి చాలామంది చాలా చిట్కాలు చెబుతూ ఉంటారు.

బరువు తగ్గడానికి ఈ పని చేయండి ఆ పని చేయండి అంటారు కానీ వాస్తవానికి చాలావరకు వాటి వెనుక సైంటిఫిక్ ఆధారాలు లేవు.

Food in Hyderabad : హైదరాబాద్‌లో తప్పక టేస్ట్​ చేయాల్సిన ఫుడ్, అవి దొరికే ప్రదేశాలు

Edible oil adulteration : ఆయిల్ సర్వే.. వంటనూనెలు కల్తీమయం!

ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ మీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చని సంవత్సరాలుగా సైంటిస్ట్ స్టడీస్ చేసి సమర్థవంతంగా కనిపించే అనేక బరువు తగ్గించే చిట్కాలు కనుగొన్నారు.

వాస్తవానికి శాస్త్రవేత్త ఆధారిత 21 బరువు తగ్గించే చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

ఎక్సర్‌సైజ్‌ మెటబాలిజం పెంచడానికి, వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుందిసంపూర్ణ ఆరోగ్యానికి ఎక్సర్‌సైజ్‌ చాలా అవసరం.

మన బాడీ బరువును నియంత్రించడానికి, కండరాలు దృఢంగా, శక్తివంతంగా ఉంచడానికి, ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఎక్సర్‌సైజ్‌ ఉపయోగపడుతుంది.

ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల.. అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, మధుమేహం, నిద్రలేమి, మానసిక రోగాల వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటూ.. ఎక్సర్‌సైజ్‌ చేయాలని, లేదా యోగాసనాలు చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.

తద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి.. ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.

అధిక తీవ్రత గల వర్కవుట్స్ చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు కండరాలు కూడా బలోపేతం అవుతాయి.

నిత్య యవ్వనంగా ఉంటారు. లాక్‌డౌన్ వల్ల చాలామంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.

Joint Pains : జాయింట్ పెయిన్స్, మోకాలి నొప్పులకు ఈ మూలికలతో చెక్

Healthy snacks : టిఫిన్​, వీటిలో అల్లం వాడితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు అద్బుతం

దీంతో శారీరక శ్రమ లేకపోవడం వల్ల స్థూలకాయం పెరిగి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

ఇటువంటి వారికి ఈ వ్యాయామాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి.

బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి, జీవక్రియను ప్రోత్సహించడానికి, శరీరాన్ని బలంగా చేయడానికి సహాయపడతాయి.

బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. కడుపు చుట్టూ ఉండే ఫ్యాట్ వల్ల అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఇతర వ్యాధులకు దారితీస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఉదర ఫ్యాట్ ను తగ్గించడానికి రోజూ ఎక్సర్‌సైజ్‌ చేయడం చాలా ముఖ్యం.

ఈ రోజు మనం నాలుగు వ్యాయామాల గురించి తెలుసుకుందాం.

తద్వారా మీరు బెల్లీ ఫ్యాట్‌ను సులభంగా కరిగించవచ్చు.

బర్పీ ఎక్సర్‌సైజ్‌

బర్నింగ్ ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల 50 శాతం కేలరీలు కరిగిపోతాయి.

ఇది మీ శరీరాన్ని బలంగా చేస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరిచే పూర్తి శారీరక ఎక్సర్‌సైజ్‌.

ఈ ఎక్సర్‌సైజ్‌ చేయడానికి మీకు పరికరాలు అవసరం లేదు.

Zinda Tilismath : హైదరాబాదుకు చెందిన జిందా తిలిస్మాత్ చరిత్ర, ఎలా చేస్తారు?

Cancer To Hamsa Nandini: వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్‌ను కనిపెట్టడం ఎలా

మీ పాదాలను దగ్గరగా ఉంచండి. చేతులను కొంచెం వెడల్పుగా పెట్టండి.

స్క్వాట్స్ పొజిషన్‌లోకి వెళ్లి మీ చేతులను నేలపై ఉంచండి.

ఇప్పుడు మీ పాదాలను ముందుకు తీసుకురండి ఆపై తిరిగి స్క్వాట్ స్థానానికి రండి.

ఇలా పునరావృతం చేయండి.

జంప్ స్క్వాట్స్

ఈ ఎక్సర్‌సైజ్‌ మీ ఎగువ & దిగువ శరీర కండరాలను బలపరుస్తుంది.

ఫ్యాట్‌ను కరిగించడంలో సహాయపడుతుంది.

ఇది చేయుటకు మీరు స్క్వాట్ పొజిషన్ పైకి దూకి యధావిధిగా అదే స్థానానికి రావాలి.

జంప్ స్క్వాట్స్ చేస్తున్నప్పుడు ఎగరడం మీద కాకుండా జంప్స్ మీ పాదాలను తాకే విధంగా చూసుకోండి.

Micro plastics in Drinking Water : మీరు తాగే నీటిలో మైక్రోప్లాస్టిక్స్..

Winter Healthy Soup : చలికాలంలో ఈ సూప్​ చాలా మంచి చేస్తుంది..

స్కిప్పింగ్

రోప్ జంపింగ్ అనేది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన ఎక్సర్‌సైజ్‌.

ఈ వ్యాయామానికి కావలిసిందల్లా ఒక తాడు మాత్రమే.

ఈ ఎక్సర్‌సైజ్‌ ఫ్యాట్‌ను కరిగించడంతో పాటు పాదాల కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

దీని కోసం నిటారుగా నిలబడి తాడు పట్టుకోండి. మీ కాళ్ళ మధ్య ఎక్కువ అంతరం ఉండకూడదు.

ఇప్పుడు తాడు నుంచి దూకడం ప్రారంభించండి.

ప్లాంక్ (Metabolism exercise)

ప్లాంక్ గొప్ప ఎక్సర్‌సైజ్‌. ఇది బాడీ ఫ్యాట్‌ను కరిగించడంలో సహాయపడుతుంది.

ఇది కాకుండా, ఇది మీ బాడీకి చక్కటి ఆకృతిని ఇస్తుంది.

ఇందుకోసం ముందుగా పడుకొని అరచేతులను చాప మీద ఉంచి, మీ బాడీని పైకి లేపండి.

చేతులను నిటారుగా ఉంచండి. సాధ్యమైనంత ఎక్కువ కాలం ఈ స్థితిలో ఉండటానికి ప్రయత్నించండి.

Fish Head Benefits : చేప త‌ల ముక్క‌లు తినే వారికే ఓ లెవ‌ల్ ప్ర‌యెజ‌నాలు

Always Be Young : ఎప్పుడూ యవ్వనంగా ఉండండిలా…

Recent

- Advertisment -spot_img