గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో మెస్ లో వడ్డించిన చికెన్ బిర్యానీలో కప్ప కనిపించడం కలకలం రేపింది. బిర్యానీలో కప్పను చూసి విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే మెస్ ఇన్‌చార్జికి ఫిర్యాదు చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బిర్యానీలో కప్ప ఉన్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అక్టోబర్ 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రిపుల్ ఐటీ కదంబ మెస్‌లో విద్యార్థులు చికెన్ బిర్యానీ తీసుకుంటుండగా అందులో ఓ కప్ప ఉంది. బిర్యానీలో కప్ప కళేబరాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ట్రిపుల్ మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు విద్యార్థులు ఫిర్యాదు చేశారు.