నేటి అసెంబ్లీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సంధ్య ఘటన జరిగిన తర్వాత డీసీపీ వచ్చి బలవంతంగా అల్లు అర్జున్‌ని కారులో ఎక్కించే వరకు అతను థియేటర్‌లోనే కూర్చున్నాడు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రిటర్న్ వెళ్తుంటే కూడా కారు రూఫ్ నుండి చేతులు ఉపుతూ వెళ్లాడు.. అంటూ అల్లు అర్జున్‌పై మండిపడ్డారు. అల్లు అర్జున్ కాలు పోయిందా..? కన్ను పోయిందా..? దేనికి మీ పరామర్శలు అని రేవంత్ ప్రశ్నించారు. నేను సీఎంగా ఉన్నన్ని రోజులు ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వను అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.