Homeహైదరాబాద్latest Newsరాజులు.. రాజులే.. ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

రాజులు.. రాజులే.. ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

  • క్షత్రియులు చట్టసభల్లోకీ రావాలి
  • కష్టపడే గుణమే వారి సక్సెస్ సీక్రెట్
  • ప్రభాస్ లేకుండా బాహుబలిని ఊహించగలమా?
  • కృష్ణంరాజు, వర్మ నాకు మంచి స్నేహితులు
  • కొంపల్లిని అభివృద్ధి చేసింది రాజులే
  • హైదరాబాద్ లో క్షత్రియభవన్ నిర్మిస్తాం
  • క్షత్రియ సేవాసమితి అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షత్రియ సామాజికవర్గంపై ప్రశంసల వర్షం కురిపించారు. క్షత్రియులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటూ కొనియాడారు. కష్టపడే గుణమే వారి సక్సెస్ సీక్రెట్ అని పేర్కొన్నారు. ప్రభాస్ లేకుంటే బాహుబలి అంతర్జాతీయ స్థాయికి వెళ్లేదా? అంటూ ప్రశ్నించారు. కృష్ణం రాజు, ప్రభాస్ తో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఫ్యూచర్ సిటీలో రాజులు పెట్టుబడులు పెట్టాలంటూ కొనియాడారు. హైదరాబాద్‌లో క్షత్రియ సేవా సమితి ఆదివారం నిర్వహించిన అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన టాలీవుడ్ నటుడు ప్రభాస్‌ తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. టాలీవుడ్, బాలీవుడ్ రేంజ్ దాటి హాలీవుడ్ కు పోటీ ఇస్తున్న నటుడు ప్రభాస్ అన్నారు. ప్రభాస్ లేకుండా బాహుబలి క్యారెక్టర్ ఊహించలేం అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. దివంగత నటుడు కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించి అధికారంలో ఉందని, ఈ విజయాల్లో బోసురాజు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంలో బోసురాజు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ‘‘నాకంటే గొప్పవాళ్లు వేదిక ముందు వినయంగా ఉన్నారు. అదీ క్షత్రియుల గొప్పతనం, కొంపల్లిని పెద్ద నగరంగా చేసింది క్షత్రియులే. మీడియాలో కూడా రాజులే రాణిస్తున్నారు. వారు ఏ రంగంలోకి వచ్చినా రాణిస్తారు.

కృష్ణంరాజు పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్పలేం. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. బాలీవుడ్‌లో సత్తా చాటిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నాకు మంచి మిత్రుడు. హాలీవుడ్‌ రేంజ్‌ సినిమా బాహుబలిని ప్రభాస్‌ లేకుండా ఊహించలేం. రాజులను చట్ట సభల్లోకి తీసుకోవాలనే ఆలోచన ఉంది. తొలుత పార్టీలో అవకాశం ఇస్తాం..తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తామని మాట ఇస్తున్నా. విశ్రాంత ఐఏఎస్‌ శ్రీనివాసరాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించాం.. వారి ద్వారా మీరు నన్ను కలవొచ్చు. అల్లూరి సీతారామరాజు, కుమరం భీం స్ఫూర్తితో కొన్నేళ్లుగా పోరాడి ప్రభుత్వం ఏర్పాటు చేశాం.

Recent

- Advertisment -spot_img