Homeహైదరాబాద్latest Newsరైతుబంధుపై సీఎం రేవంత్ GOOD NEWS..

రైతుబంధుపై సీఎం రేవంత్ GOOD NEWS..

రైతుబంధు నిధులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇతర చెల్లింపులను ఆపివేసి రైతుబంధుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మొత్తం 69 లక్షల మంది రైతులకు నిధులు అందజేయాల్సిందిగా.. ఇప్పటివరకు 46 లక్షల మంది రైతులకు మాత్రమే నిధులు చెల్లించినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: వారికి తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్

ఇప్పటి వరకు రూ.2450 కోట్లు రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి. ఈ నెలాఖరులోగా ఐదెకరాల లోపు ఉన్న రైతులకు రైతు బంధు నిధులు జమ చేయాలని నిర్ణయించారు. ఓ వైపు రైతుబంధు నిధులు చెల్లింపు ఆలస్యం కావడంతో.. ప్రభుత్వం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: గుర్రంతో గొర్రు తోలాడు.. VIDEO ఫుల్ వైరల్..

ఐదెకరాలకు మించి ఉన్న రైతులకు ఫిబ్రవరిలో చెల్లింపులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొంత మంది రైతులు తమకు ఉన్న ఒకటి, రెండు ఎకరాలకు కూడా నిధులు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: పాపం సీఎం రేవంత్ ఇంగ్లిష్ పై ఫుల్ ట్రోల్స్

Recent

- Advertisment -spot_img