ఇదేనిజం దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గం, డిండి మండలం తవక్లాపూర్ గ్రామానికి చెందిన బయ్య శ్రీనయ్య కుమారుడు బయ్య వంశీ చైతన్య కాళ్ళ నొప్పులతో బాధపడుతు చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. చికిత్స కోసం డాక్టర్లు దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పడంతో డిండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లవెల్లి రాజేష్ రెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ దృష్టికి తీసుకపోగా బాలు నాయక్ వెంటనే స్పందించి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించి, 1,60,000 రూపాయల సిఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ఇవ్వడం జరిగింది.