Homeహైదరాబాద్latest Newsకమల్ హాసన్ “ఇండియన్ 2” నుంచి క్రేజీ అప్డేట్

కమల్ హాసన్ “ఇండియన్ 2” నుంచి క్రేజీ అప్డేట్

దర్శకుడు శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ఇండియన్ 2”. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌లో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జూలై 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. నేడు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేయనున్నారు. రేపు సాయంత్రం 5:00 గంటలకు పూర్తి పాటను విడుదల చేయనున్నారు. ప్రధాన భారతీయ భాషల్లో ఈ పాటను విడుదల చేయనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.ఈ సినిమాలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ అలాగే సిద్ధార్థ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img