– శిక్ష విధించిన సింగపూర్ కోర్టు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: సింగపూర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ భారత్‌కు చెందిన వ్యక్తికి అక్కడి కోర్టు 16 ఏండ్ల జైలు శిక్ష విధించింది. 2019లో సింగపూర్ యూనివర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్థిని రాత్రి వేళ బస్‌స్టాప్ వద్దకు వెళ్తుండగా.. అక్కడే క్లీనర్‌గా పని చేస్తున్న చిన్నయ్య అనే వ్యక్తి ఆమెకు తప్పుడు సమాచారం ఇచ్చి దారి మళ్లించాడు. ఆ తర్వాత యువతిని వెంబడిస్తూ ఆమెను గాయపరిచాడు. అనంతరం ఆమెను సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. కొంతసేపటి తర్వాత షాక్ నుంచి తేరుకున్న బాధిత యువతి.. పక్కనే పడి ఉన్న తన ఫోన్ నుంచి ఆమె స్నేహితుడికి కాల్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో సింగపూర్ కోర్టు విచారణ చేపట్టి తాజాగా తీర్పు వెలువరించింది. భారత్‌కు చెందిన చిన్నయ్యకు 16 ఏళ్ల జైలు శిక్షతో పాటు 12 బెత్తం దెబ్బలు తినాలని ఆదేశించింది.