Homeక్రైంCrime News : విజయవాడలో బస్టాండ్​లో ఆర్టీసీ బస్సు బీభత్సం

Crime News : విజయవాడలో బస్టాండ్​లో ఆర్టీసీ బస్సు బీభత్సం

– ప్రయాణికుల మీదకు దూసుకెళ్లిన బస్సు
– ఇద్దరు దుర్మరణం

ఇదేనిజం, ఏపీ బ్యూరో: విజయవాడ బస్టాండ్​లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రయాణికుల మీదకు దుసుకెళ్లడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలోని పండిట్​ నెహ్రూ బస్టాండ్​లో ఈ ప్రమాదం జరిగింది. 12వ ప్లాట్‌ఫాంపై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి బస్సు వేగంగా దూసుకెళ్లింది. ఆర్టీసీ బుకింగ్‌ క్లర్క్‌, ఓ మహిళ మృతిచెందగా.. మరో మహిళ, చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన మహిళను చీరాలకు చెందిన కుమారిగా, బుకింగ్‌ క్లర్క్​ను గుంటూరు-2 డిపోకు చెందిన ఒప్పంద ఉద్యోగి వీరయ్యగా గుర్తించారు. ప్రమాదంలో కుమారి కోడలు సుకన్య, మనవడు అయాన్‌ (18 నెలలు)కు తీవ్ర గాయాలయ్యాయి. సుకన్య కాలు విరిగింది. అయాన్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ నూతన ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్‌ రివర్స్‌ గేర్‌కు బదులు ఫస్ట్‌ గేర్‌ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో 11, 12 ప్లాట్‌ఫాంల వద్ద దిమ్మెలు విరిగి ఫెన్సింగ్‌, కుర్చీలు ధ్వంసమయ్యాయి. విజయవాడలోని ఆటోనగర్‌ డిపోకు చెందిన బస్సు.. గుంటూరు వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందిస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img