హైదరాబాద్ నగరానికి విద్యుత్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. నేటి నుంచి నగరంలో కరెంట్ కోతలు విధిస్తున్నట్టు తెలిపారు. విద్యుత్ స్తంభాల మరమ్మత్తు , వార్షిక నిర్వహణలో భాగంగా ఈ కోతలను విధిస్తున్నట్లు వారు చెప్పారు. ఈ విద్యుత్ కోతలు ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నందుకు చింతిస్తున్నట్లు TSSPDCL ఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
జనవరి 17 బుధవారం నుంచి ఫిబ్రవరి 10 వరకు కూడా ఈ కరెంట్ కోతలు ఉంటాయని తెలిపారు. వచ్చే వేసవి కాలం/ రబీ సీజన్స్ లో అధికంగా విద్యుత్ డిమాండ్ ఉండడంతో దానికి సిద్దం కావడం కోసం వార్షిక నిర్వహణలో భాగంగా రెండు గంటల పాటు విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు.