ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీనిపై రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఏ-32గా పేర్కొన్న ఈడీ.. ఆమెపై సంచలన అభియోగాలు మోపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత కీ రోల్ పోషించారని.. కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారని పేర్కొంది. ఈ కేసులో ఇప్పటి వరకు 18 మందిని అరెస్టు చేశారు.