ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇటీవల కేసీఆర్ కుమార్తె కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కవిత తండ్రి కేసీఆర్ ఒక్కసారి కూడా ఆమె అరెస్ట్ గురించి మాట్లాడలేదు. అయితే తెలంగాణలో అధికారం కోల్పోయి బీజేపీలో మంచి పేరు తెచ్చుకోవాలనుకునే కేసీఆర్ మౌనం వ్యూహాత్మకంగా ఉండొచ్చని, అందుకే కవిత అరెస్ట్‌పై మాట్లాడడం లేదని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.