మంగళవారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు మన 100 రోజుల పరిపాలనికి రిఫరెండమని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేసారు. 14 పార్లమెంట్ స్థానాలు గెలిచి సోనియానికి కృతజ్ఞత చెబుతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశం రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు వలనే సర్వేల ఆధారంగా అధిష్టానం అభ్యర్థులని ఫిక్స్ చేస్తుందని ఆయన అన్నారు. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఒకదాని ఇంకొకటి సంబంధం ఉందని అన్నారు. చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి సునీత మహేందర్ రెడ్డి. సికింద్రాబాద్ దానం నాగేంద్ర లని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది అని చెప్పారు.