Homeహైదరాబాద్latest Newsఅలిపిరి వద్ద ధనుష్​ మూవీ షూటింగ్​

అలిపిరి వద్ద ధనుష్​ మూవీ షూటింగ్​

– శ్రీవారి భక్తులకు ఇబ్బందులు
– కపిల తీర్థం నుంచి తిరుమల వెళ్లే వాహనాలు దారి మళ్లింపు


ఇదేనిజం, ఏపీ బ్యూరో: తిరుమలలోని అలిపిరి వద్ద మంగళవారం ధనుష్​ మూవీ షూటింగ్​ జరుగుతోంది. దీంతో కపిల తీర్థం టు తిరుమల రూట్​లో వాహనాలను దారిమళ్లించారు. మూవీ షూటింగ్ తో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షూటింగ్‌కు అధికారులు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక షూటింగ్ నేపథ్యంలో భారీ సంఖ్యలో బౌన్సర్లను కూడా మోహరించారు. హరేరామ హరే కృష్ణ రోడ్​ లోకి వాహనాలను మళ్లించడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Recent

- Advertisment -spot_img