టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది. దీంతో పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావరణం లేదని అనిపిస్తోంది. ఆటగాళ్లకు కెప్టెన్ బాబర్ అజామ్‌తో సమస్యలు ఉన్నాయేమో?. జట్టును నాశనం చేయాలన్నా, నాణ్యమైన టీమ్‌గా మార్చాలన్నా కెప్టెన్‌కే సాధ్యం. ఈ వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత దీనిపై వివరంగా మాట్లాడతా’’అని అఫ్రిది వ్యాఖ్యానించాడు.