గణపతిలో సర్వదేవతలూ కొలువయ్యున్నారు. ఆయన ముఖం విష్ణువు, నేత్రాలు శివుడు, నాభి బ్రహ్మ, ఎడమభాగం శక్తి, కుడిభాగం సూర్యుడు’ అంటూ వర్ణించారు తత్త్వవేత్తలు. అయితే గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి, ఆ స్వామి ఆరాధనకు విశిష్టతను సంతరింపచేసినది బాలగంగాధర తిలక్. జాతీయోద్యమంలో హిందువులను అందరినీ సంఘటితపరచాలనే గొప్ప సంకల్పంతో ఆ లోకమాన్యుడు మహారాష్ట్రలో ప్రారంభించిన విఘ్నేశ్వరుని ఉత్సవాలు.. క్రమంగా దేశమంతటా వ్యాపించాయి.