Homeహైదరాబాద్latest Newsమీరు తరచుగా ఈ టాబ్లెట్ ని తీసుకుంటారా..? మీ ప్రాణాలు పోవచ్చు జాగ్రత్త..!

మీరు తరచుగా ఈ టాబ్లెట్ ని తీసుకుంటారా..? మీ ప్రాణాలు పోవచ్చు జాగ్రత్త..!

పారాసెటమాల్ అనేది తరచుగా జ్వరం, తలనొప్పి మరియు శరీర నొప్పులకు ఉపయోగించే టాబ్లెట్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా మంది దీనిని ఉపయోగించడం కూడా మనం చూడవచ్చు. కానీ, ఈ టాబ్లెట్ మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పారాసెటమాల్‌ను అధికంగా తీసుకోవడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని నివేదించారు. ముఖ్యంగా వృద్ధులు, అంటే 65 ఏళ్లు పైబడిన వారు కిడ్నీ వ్యాధితో బాధపడవచ్చు. అంటే దీని వినియోగం అనేక దుష్ప్రభావాలు కలిగిస్తుంది. పారాసెటమాల్ యొక్క స్వల్పకాలిక అధిక మోతాదు కాలేయ పై ప్రతికూల ప్రభావాలను కలిగించవచ్చు.ఈ టాబ్లెట్ ని తరచుగా తీసుకుంటే కాలేయం దెబ్బతింటుంది అని, ఆలగే గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందిని నిపుణలు తెలిపారు. అందువల్ల, పారాసెటమాల్ అవసరమైనప్పుడు మరియు డాక్టర్ సూచించిన మోతాదులో తీసుకోవాలి అని చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img