Homeజిల్లా వార్తలుఅధైర్య పడొద్దు.. పార్టీ అండగా ఉంటుంది: మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

అధైర్య పడొద్దు.. పార్టీ అండగా ఉంటుంది: మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మహ్మద్ నగర్ మండల కేంద్రంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బి ఆర్ స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతు.. కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రజలకు కాంగ్రెస్ పాలన అర్థమైందని బి ఆర్ స్ కు మళ్లీ మంచి రోజులు వస్తాయన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా సత్తా చాటాలని కార్యకర్తలకు సూచించారు. బి ఆర్ స్ పాలనలో రైతు బంధు, రైతు భీమా తదితర పథకాలు సకాలంలో అందాయని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు.కార్యకర్తలు అధైర్య పడవద్దని ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ,అన్నారు ఈ కార్యక్రమం లో ఉమ్మడి జిల్లాల జెడ్పీ మాజీ ఛైర్మన్ దాఫెదర్ రాజు.మరియు మండల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాదుల సత్యనారాయణ, గంగారెడ్డి, వాజిద్ అలీ, సంగమేశ్వర్ గౌడ్, లింగాల రామచందర్, లక్ష్మీనారాయణ, నారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img