Homeజిల్లా వార్తలుమద్యం మత్తులో కొడవలితో.. భార్యను హతమార్చిన భర్త

మద్యం మత్తులో కొడవలితో.. భార్యను హతమార్చిన భర్త

ఇదే నిజం, బాన్సువాడ: కుటుంబ కలహాలు.. క్షణికావేశంతో ఓ భర్త అతి కిరాతకంగా భార్యను చంపిన ఘటన వర్ని మండలం వడ్డేపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన పెంటవ్వ(46) భర్త బాలయ్యల మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న బాలయ్య క్షణికావేశంలో కొడవలితో మెడపై వేటు వేయడంతో పెంటవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img