Homeక్రైంఆప్​ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు

ఆప్​ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు

– లిక్కర్​ స్కామ్​ కేసులో మళ్లీ దూకుడు
– తెల్లవారుజామునే సంజయ్​ సింగ్​ ఇంటికి చేరుకున్న అధికారులు

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: లిక్కర్​ స్కామ్​ కేసులో మళ్లీ వేగం మొదలైంది. తాజాగా ఢిల్లీలోని ఆప్​ ఎంపీ సంజయ్ సింగ్​ ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. బుధవారం తెల్లవారుజామును ఈడీ అధికారులు సంజయ్ సింగ్​ ఇంటికి వెళ్లి.. తనిఖీలు చేపట్టారు. ఈ కేసులో డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియాను సీబీఐ ఫిబ్రవరిలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మద్యం పాలసీ కేసులో కేంద్ర ఏజెన్సీల స్కానర్‌లో ఉన్న తాజా ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వం 2021 నాటి మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ పాలసీ కేసు దాఖలు చేశారు. కానీ ఆ తరువాత రద్దు చేశారు. తాజాగా సంజయ్​ సింగ్​ ఇంట్లో సోదాలు జరగడం ఆసక్తి కరంగా మారింది.

Recent

- Advertisment -spot_img