ఇదేనిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలంలోని చిల్వాకోడూర్,తిరుమలపూర్ అంగన్వాడీ కేంద్రాలలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏడు నుండి తొమ్మిది నెలల గర్భవతి తీసుకొనవలసిన జాగ్రత్తలు ఆహారము ఆరోగ్యము బరువు హిమోగ్లోబిన్ పుట్టిన వెంటనే గంటలోపు మురుపాల ప్రాముఖ్యత రోజు ఆహారంలో ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు,గింజ ధాన్యాలు,పప్పు దినుసులు అంగన్వాడీ కేంద్రంలో ఒకరోజు సంపూర్ణ భోజనము తినవలెనని,పుట్టిన దినం రోజు ముర్రుపాలు పట్టించవలెనని,మురుపాలలో విటమిన్ ఏ అధికంగా ఉంటుందని వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని,అమ్మపాలు అమృతంతో సమానమని గర్భవతులకు వివరించనైనది.
ఆరు నెలలు దాటిన పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలలో అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించి దాని యొక్క ప్రాముఖ్యతను రోజు పిల్లలకు ఏ పరిమాణంలో ఇవ్వవలెనని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత,హెచ్ఎం లక్ష్మిబాయి,హెల్త్ సూపర్వైజర్ శారద,ఏఎన్ఎం విమల,సుమలత,మహిళా సాధికారత సిబ్బంది,గౌతమి హేమశ్రీ,సులోచన,ఆశా వర్కర్స్ స్వప్న,వకుల,అంగన్వాడీ టీచర్స్ విజయ,గంగాభవాని,నర్మద,గర్భవతులు,బాలింతలు,తల్లులు,పిల్లలు పాల్గొన్నారు.తిరుమలాపూర్ గ్రామంలో పల్లె దావకాన డాక్టరు మౌనిక,పంచాయతీ సెక్రెటరీ విక్రమ్,అంగన్వాడీ టీచర్స్ లలిత,హరిత,దమ్మన్నపేట అంగన్వాడి టీచర్ రజిత,ఆశ వర్కర్స్ వసంత,ఉమ,మంగ,వివో అంజలి,గర్భవతులు,బాలింతలు,తల్లులు,పిల్లలు పాల్గొన్నారు.