Homeహైదరాబాద్latest Newsబంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరో 12 గంటల్లో ఉత్తర దిశగా కదులుతుంది. క్రమంగా ఈ అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తరువాత 24 గంటల పాటు వాయుగుండం తీవ్రత కొనసాగనుంది. అల్పపీడన ప్రభావంతో ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img