Homeహైదరాబాద్latest Newsప్రేమలో పడిపోయా: జాన్వీ కపూర్

ప్రేమలో పడిపోయా: జాన్వీ కపూర్

ప్రేమలో పడిపోయానంటుంది జాన్వీ కపూర్. అసలు విషయానికి వస్తే.. నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ‘హాయ్ నాన్న’ హిట్ టాక్ అందుకుంది. మంచి రెస్పాన్స్‌తో అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. తండ్రి పాత్రలో నాని నటనకు సినీ ప్రియులు ఫిదా అయ్యారనే చెప్పాలి. ఇక థియేటర్లతో పాటు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన ఈ చిత్రం ఇక్కడ కూడా అదిరే రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ చిత్రాన్ని ఎంతోమంది మెచ్చుకోగా.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు.

‘‘హాయ్ నాన్న మూవీలో మృణాల్ ఠాకూర్ నటనకు ఫిదా అయి.. ప్రేమలో పడిపోయా. తొలి ప్రయత్నంలోనే మనసుని హత్తుకునే చిత్రాన్ని తెరకెక్కించినందుకు దర్శకుడు శౌర్యువ్‌కు కృతజ్ఞతలు. ఇక నాని ఎప్పటిలాగానే అదరగొట్టేశారు’’ అంటూ ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు.

Recent

- Advertisment -spot_img